త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను అలా చూపిస్తాడట!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు.

 Ntr Heroism To Be Peaks For Trivikram Movie, Ntr, Trivikram, Ntr30, Tollywood Ne-TeluguStop.com

ఇక ఈ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు తారక్ రెడీ అయ్యాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు.

కాగా ఈ సినిమాను పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాకు ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్‌ను పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా ఈ సినిమాలో తారక్‌ను ఓ రేంజ్‌లో చూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.హీరోయిజం‌ను పీక్స్‌లో చూపించే దర్శకుల్లో త్రివిక్రమ్ ముందుంటాడు.అతడులో మహేష్ బాబు, అత్తారింటికి దారేదిలో పవన్ పాత్రలను ఆయన ఎలా ఎలివేట్ చేశాడో అందరికీ తెలిసిందే.

ఇప్పుడు మరోసారి తారక్ హీరోయిజాన్ని నెక్ట్స్ లెవెల్‌లో చూపెట్టేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌లో తారక్ పాత్రను హైలైట్‌గా చూపించనుండటంతో త్రివిక్రమ్ సినిమాలో ఎలా చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లో 30వ చిత్రంగా తెరకెక్కనుండగా, ఈ సినిమాను పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడు.

మరి ఈ సినిమాలో తారక్‌ను మాటల మాంత్రికుడు ఎలా చూపిస్తాడనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube