ఆ విషయంలో తారక్ హ్యా్ట్రిక్.. నిరాశలో ఫ్యాన్స్

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అతి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 Ntr Hattrick Of No Films In A Year, Ntr, Rrr, Aravinda Sametha, Tollywood News,-TeluguStop.com

ముఖ్యంగా తారక్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.దీనికి బలమైన కారణం కూడా ఉంది.

తారక్ నటించిన లాస్ట్ మూవీ ‘అరవింద సమేత’ 2018లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఆ తరువాత తారక్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సినిమా రాలేదు.2019లో తారక్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.పోనీ 2020లో ఆర్ఆర్ఆర్ వస్తుందని ప్రేక్షకులు ఆశించారు.

కానీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో ఆర్ఆర్ఆర్ రిలీజ్ 2021లో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో 2020లో కూడా తారక్ నుండి ఎలాంటి సినిమా లేదు.

అయితే ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ కారణంగా ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ మరింత ఆలస్యం కానుండటంతో 2021లోనూ ఈ సినిమా రిలీజ్ అయ్యే సూచనలు కనిపించడం లేదని చిత్ర వర్గాల టాక్.

ఈ లెక్కన 2021లోనూ తారక్ నుండి సినిమా ఉండకపోవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.

వరుసగా మూడు సంవత్సరాలుగా తారక్ నుండి ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఆయన సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఇలా ఒక సంవత్సరంలో ఒక్క సినిమా కూడా లేకుండా ఉండే విషయంలో తారక్ హ్యాట్రిక్ కొట్టాడని చెప్పాలి.

మరి ఆర్ఆర్ఆర్ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో, తారక్‌ను వెండితెరపై తిరిగి ఎప్పుడు చూస్తామో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube