బింబిసార విషయంలో ఆ తప్పు చేసిన తారక్.. ఎంత పని చేసావ్ అంటున్న ఫ్యాన్స్!

గత రెండేళ్లుగా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.అయితే ఈ కొత్త ఏడాదిలో టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే మళ్ళీ ప్లాప్స్ ఎదురవుతున్నాయి.

 Ntr Guest Role In Kalyan Ram Bimbisara, Kalyan Ram , Bimbisara , Samyukta Menon,catherine Tresa, Ntr Guest Role, Ntr-TeluguStop.com

ప్రేక్షకులు వచ్చిన సినిమాను వచ్చినట్టు ప్లాప్ చేస్తుండడంతో టాలీవుడ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రంమలోనే ఆగష్టు మొదటి వారంలో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలు కూడా ఆడియెన్స్ ను మెప్పించాయి అనే చెప్పాలి.

 NTR Guest Role In Kalyan Ram Bimbisara, Kalyan Ram , Bimbisara , Samyukta Menon,Catherine Tresa, NTR Guest Role, NTR-బింబిసార విషయంలో ఆ తప్పు చేసిన తారక్.. ఎంత పని చేసావ్ అంటున్న ఫ్యాన్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా కూడా ఉంది.

కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసారను యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేసారు.ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఆగష్టు 5న థియేటర్స్ లోకి వచ్చింది.

ఎప్పటి నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో కళ్యాణ్ ఒకరు.

ఏడాదిన్నర తర్వాత బింబిసార సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది.

కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది.అలాగే రెండు రోజుల్లోనే లాభాల బాట పట్టిన ఈ సినిమా రెండు మూడు రేట్ల లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Telugu Bimbisara, Catherine Tresa, Kalyan Ram, Ntr Guest Role, Ntrguest, Samyukta Menon-Movie

అయితే ఇదే సమయంలో నందమూరి ఫ్యాన్స్ మధ్య ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతుంది.ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన తమ్ముడితో గెస్ట్ రోల్ చేయించాలని అనుకున్నాడట.కానీ ఎన్టీఆర్ అదే సమయంలో ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉండడంతో అన్న ఆఫర్ ను సున్నితంగా కాదన్నాడట.

Telugu Bimbisara, Catherine Tresa, Kalyan Ram, Ntr Guest Role, Ntrguest, Samyukta Menon-Movie

కానీ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు ఈ విషయంలో తారక్ తప్పు చేసాడని ఫీల్ అవుతున్నాడు.ఇలాంటి ఒక సినిమాలో చిన్న పవర్ ఫుల్ రోల్ చేసి ఉంటే ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్న నందమూరి మల్టీ స్టారర్ చేయాలనే కోరిక కూడా నెరవేరేది.అలాగే ఈ సినిమాలో తారక్ గెస్ట్ రోల్ చేసి ఉంటే ఈ సినిమా మరో రేంజ్ కు వెళ్లిపోయేది అంటూ ఫ్యాన్స్ ఆసక్తికర చర్చ మొదలెట్టారు.

ఏది ఏమైనా ముందు ముందు అయినా ఫ్యాన్స్ కోరిక ప్రకారం బాబాయ్ అబ్బాయిలు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తారేమో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube