ఎంజీఆర్ తిరస్కరించిన పాత్రకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..

సినిమా సక్సెస్ కావాలంటే.కథకు అనుగుణంగా చక్కటి పాత్రలు ఉండాలి.

 Ntr Green Signal For Mgr Rejected Movie , Mgr, Ntr, Gundamma Katha, Anji Charact-TeluguStop.com

ఒక పాత్రతో మరొక పాత్రను అద్భుతంగా రూపొందించగలగాలి.అన్ని క్యారెక్టర్లు చక్కగా పండినప్పుడే సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది.

అందుకే పాత్రలను రూపొందించే సమయంలో ఫిల్మ్ మేకర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.అయితే సినిమా పాత్రలను ఎంచుకోవడంలో మాత్రం తెలుగు సినిమా దిగ్గజనటుడు ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.ఆయన జీవితంలో ఎన్నో మరుపురాని పాత్రలు చేశాడు.ఆయా పాత్రల్లో లీనమైపోయాడు కూడా.

ఎన్టీఆర్ పోషించి కీలక పాత్రల్లో ఒకటి గుండమ్మ కథ చిత్రంలోని అంజి క్యారెక్టర్.ఎంతో చలాకి తనంతో కూడిన పాత్ర ఇది.ఈ క్యారెక్టర్ చాలా నేచురల్ గా ఉంటుంది.చక్కటి హాస్యంతో ముందుకు సాగుతుంది.

అత్తపై అల్లుడు వేసే పంచ్ లు మామూలుగా ఉండవు.మొత్తంగా ఎన్టీఆర్ లోని హాస్య చతురతను ఈ సినిమా బయటపెట్టింది.

ఎన్టీఆర్ గంభీరమైన పాత్రలే కాదు.చక్కటి సాధారణ క్యారెక్టర్లు కూడా చేయడగలడని నిరూపించిన సినిమా గుండమ్మ కథ.

Telugu Anji Character, Gundamma Katha, Ntrgreen, Tollywood-Telugu Stop Exclusive

అంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా మాస్ పాత్రలకు ఈ సినిమా పునాది రాయిగా చెప్పుకోవచ్చు.అప్పటి వరకు పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన.ఈ పాత్రలతో సాంఘిక చిత్రాల్లో అద్భుతంగా రాణించగలడని నిరూపించాడు.ఈ క్యారెక్టర్ ను అప్పట్లో తమిళంలో ఎంజీఆర్ ను చేయాలని అడిగారట దర్శకనిర్మాతలు.

అయితే టాప్ హీరోగా ఉండి.పనివాడిగా నటిస్తూ మాటలు పడే ఖర్మ తనకు పట్టలేదని చెప్పాడట.

కానీ ఎన్టీఆర్ ఈ పాత్ర గురించి వినగానే చాలా నచ్చింది అని చెప్పాడట.తప్పకుండా చేస్తానని మాట ఇచ్చాడట.

అంతేకాదు.దగ్గరుండి అంజి పాత్రకు మెరుగులు దిద్దించాడట ఎన్టీఆర్.

అందుకే ఇప్పటికీ ఈ సినిమాలోని ఆయన పాత్ర అద్భుతంగా పేరు తెచ్చి పెట్టింది.హీరో అన్నాక.

అదీ ఇదీ అని కాదు.ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలని అని చెప్పేవాడు ఎన్టీఆర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube