నారా బ్రాహ్మణి ఇచ్చిన గిఫ్ట్ చూసి కంటతడి పెట్టిన తారక్..! ఇంతకీ ఆ చెల్లెలు అన్నకు ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా.?     2018-10-22   09:23:51  IST  Sai Mallula

‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్స్‌ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అరవింద సమేత’. రాయలసీమ నేపథ్యంలో వచ్చిన ఈ పవర్ ఫుల్ యాక్షన్ చిత్రానికి ప్రేక్షకులు , అభిమానులు ప్రశంసలు అందిస్తున్నారు.

NTR Gets Emotional Over Nara Brahmani Surprise Gift-

NTR Gets Emotional Over Nara Brahmani Surprise Gift

నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె, నారా లోకేష్ భార్య అయిన బ్రాహ్మణి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూసి అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించింది.అంతేకాదు విజయదశమి సందర్భంగా తన అన్న ఎన్టీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను కూడా పంపించింది. ఇటీవలే రోడ్డుప్రమాదంలో చనిపోయిన హరికృష్ణ గారి పాత ఫోటోలను సేకరించి వాటిని ఆల్బమ్‌గా తయారు చేయించి సీడీ రూపంలో తన అన్న ఎన్టీఆర్‌కి కానుకగా పంపింది. తన చెల్లి నారా బ్రాహ్మణి పంపిన ఆ సీడీను చూసిన ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ రేర్ కలెక్షన్ ఫోటోలను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు. నారా బ్రాహ్మణికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

NTR Gets Emotional Over Nara Brahmani Surprise Gift-

బ్రహ్మణి ఎన్టీఆర్ నటన ఫై ఓ రేంజ్ లో ప్రసంశలు కురిపించింది. ‘అరవింద సమేత చాలా బాగుందంటూ అన్నయ్య’ అంటూ తారక్ నటనపై ట్వీట్స్ చేసి వార్తల్లో నిలిచింది. నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో బాలయ్య రావడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.