ఎన్టీఆర్‌ టీవీ షో పై జెమిని టీవీ మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్ లీక్ చేసింది, ఏంటో తెలుసా?

మూడు నెలల క్రితం ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో ఒక షో ప్రసారం కాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఆ తర్వాత షో గురించి వార్తలు రాకపోవడంతో అసలు షో ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

 Ntr Gemini Tv Show Update-TeluguStop.com

అలాంటి సమయంలో ఎన్టీఆర్ హోస్టింగ్ తో ఒక షో రాబోతుంది అంటూ మరో సారి జెమిని వారు అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు.ఇటీవలే జెమిని టీవీ టీం వారు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ పై ఒక యాడ్‌ ను షూట్‌ చేశారు.

ఆ ప్రోమో షూటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా కనిపించాడు.ఆ షో కు సంబంధించిన ప్రోమో అవ్వడం వల్ల మళ్లీ షో గురించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

 Ntr Gemini Tv Show Update-ఎన్టీఆర్‌ టీవీ షో పై జెమిని టీవీ మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్ లీక్ చేసింది, ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు కాస్త అటు ఇటుగా ఈ షో ఉంటుందని అంటున్నారు.ఎన్టీఆర్‌ గతంలో హోస్ట్‌ గా బిగ్‌ బాస్ చేశాడు కనుక అంచనాలు భారీగా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా త్రివిక్రమ్‌ తో ప్రోమోను చేయించారు.

జెమిని టీవీ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం షో కోసం షూట్‌ చేసిన ప్రోమోను వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలో జెమిని టీవీలో ప్రసారం చేయబోతున్నారు.

ఇక షో ను మే నుండి మొదలు పెట్టబోతున్నారు.ఒక వైపు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా ను చేస్తూ జెమిని టీవీ షో కోసం షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ పాల్గొంటాడని అంటున్నారు.

ప్రోమో షూట్‌ వరకు మాత్రమే కాకుండా త్రివిక్రమ్‌ ఆ తర్వాత షో ను కూడా దగ్గరుండి పర్యవేక్షించడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాడట.భారీ బడ్జెట్‌ తో రూపొందబోతున్న ఈ షో ప్రస్తుతం అంచనాలను ఆకాశానికి తాకేలే చేస్తున్నారు.

రికార్డు బ్రేకింగ్‌ రేటింగ్ ను ఈ షో దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

.

#MeeloEvaru #Update #Shoot #Trivikram #Show

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు