జెమిని టీవీ షో కోసం ఎన్టీఆర్‌ ప్రోమో షూట్‌, రెండు వారాల్లో బుల్లి తెరపై రచ్చ షురూ

మూడు నాలుగు నెలల క్రితం జెమిని టీవీ కోసం ఎన్టీఆర్‌ మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో ను చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ఇప్పటి వరకు ఏ సౌత్‌ స్టార్‌ కూడా దక్కించుకోనంత పారితోషికంను ఈ షో కోసం ఎన్టీఆర్‌ దక్కించుకుంటున్నాడు అంటున్నారు.

 Ntr Gemini Tv Game Show Promo Shooting Completed-TeluguStop.com

జెమిని టీవీని జనాలు పట్టించుకోవడం లేదు.ఇలాంటి సమయంలో భారీ రేటింగ్‌ కోసం ఎన్టీఆర్‌ తో మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షో ను నిర్వహించి ప్రేక్షకులను ఆకర్షించడంతో పాటు రేటింగ్‌ ను దక్కించుకోవడం కోసం భారీ ఎత్తున ఖర్చు పెడుతున్నారు.

ఆ షో గురించి ఆ మద్య పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.కాని మళ్లీ ఆ షో గురించి మళ్లీ ప్రచారం లేకపోవడంతో అసలు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

 Ntr Gemini Tv Game Show Promo Shooting Completed-జెమిని టీవీ షో కోసం ఎన్టీఆర్‌ ప్రోమో షూట్‌, రెండు వారాల్లో బుల్లి తెరపై రచ్చ షురూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం జెమిని టీవీ వారు మళ్లీ షో గురించిన చర్చలు మొదలు పెట్టారు.

తాజాగా ఎన్టీఆర్ జెమిని టీవీ షో కోసం ప్రొమో షూట్‌ లో పాల్గొన్నాడు.

వెంటనే కాకుండా రెండు వారాల తర్వాత ఆ ప్రోమోను జెమిని టీవీలో టెలికాస్ట్‌ చేసేందుకు సిద్దం అవుతున్నారు.జెమిని టీవీలో స్ట్రీమింగ్‌ చేసేందుకు యాడ్‌ షూట్‌ ను చేయడంతో పాటు ఎన్టీఆర్‌ ఒక ఆసక్తికరమైన డైలాగ్‌ ను కూడా చెప్పాడు.

మొత్తం రెండు ప్రోమోల కోసం ఎన్టీఆర్‌ షూట్‌ లో పాల్గొన్నాడు.మొదటి ప్రోమో రెండు వరాల్లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది.ఆ తర్వాత ప్రోమో కూడా మరో వారం రెండు వారాల గ్యాప్‌ తో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.మొత్తానికి ఎన్టీఆర్‌ అభిమానులు ఎదురు చూస్తున్న జూనియర్‌ బుల్లి తెర షో కు సంబంధించిన అప్ డేట్‌ రావడం తో అంతా హ్యాపీగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ ను గతంలో బిగ్‌ బాస్ సీజన్‌ 1 కోసం స్క్రీన్‌ పై చూశాం.మళ్లీ ఇప్పుడు బుల్లి తెరపై జెమిని టీవీ ద్వారా ఎన్టీఆర్‌ ను చూడబోతున్నామన్నమాట.

#NTR TV Show #NtrGemini #Ntr Game Show #Game Show #NtrMeelo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు