చాలా కాలం తర్వాత... ఈఎంకే కోసం మీడియా ముందుకు రాబోతున్న ఎన్టీఆర్

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ జెమిని టీవీలో కౌన్ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్‌ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే షో కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది, లోగో ను కూడా జెమిని వారు విడుదల చేసి సందడి చేస్తున్నారు.

 Ntr Gemini Tv Evaru Meelo Kotishwarulu Show Press Meet Very Soon-TeluguStop.com

ఇలాంటి సమయంలో కౌన్‌ బనేగా కరోడ్‌ పతి తెలుగు వర్షన్‌ కు సంబంధించిన కీలక విషయాలను తెలియ జేసేందుకు నిర్మాణ సంస్థ వారు ప్రెస్ మీట్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది.అందుకు సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారట.

ఎన్టీఆర్‌ మీడియా ముందుకు రాక చాలా నెలలు అయ్యింది.ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్ కారణంగా బయటకు కనిపించని ఎన్టీఆర్‌ ఎట్టకేలకు ఈ షో ప్రమోషన్‌ కోసం ప్రెస్ మీట్‌ లో హాజరు కాబోతున్నట్లుగా జెమిని వర్గాల వారు ప్రకటించారు.

 Ntr Gemini Tv Evaru Meelo Kotishwarulu Show Press Meet Very Soon-చాలా కాలం తర్వాత… ఈఎంకే కోసం మీడియా ముందుకు రాబోతున్న ఎన్టీఆర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెద్ద ఎత్తున ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం ఉంటుందని అంటున్నారు.

మీలో ఎవరు కోటీశ్వరుడు షో ను గతంలో నాగార్జున మరియు చిరంజీవి హోస్ట్‌ చేయగా అది స్టార్‌ మా లో ప్రసారం అయ్యింది.

చిరంజీవి షో కు హోస్ట్‌ చేయడంతో అది కాస్త జనాలు పట్టించుకోక పోవడంతో మొత్తానికి వదిలేశారు.స్టార్‌ మా వారు వదిలేసిన షో ను టైటిల్‌ మార్చి ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమాన్ని ప్రకటించేందుకు సిద్దం అయ్యారు.

ఎన్టీఆర్‌ ఇప్పటికే బిగ్‌ బాస్ తో రికార్డు టీఆర్పీ రేటింగ్‌ ను దక్కించుకున్నాడు.కనుక ఈ షో తో మళ్లీ జెమిని టీవీ రేటింగ్ లను ఓ రేంజ్ లో ఉంచుతాడని ఎన్టీఆర్‌ పై ఆ ఛానెల్‌ ప్రతినిథులు ఆశగా నమ్మకంగా ఉన్నారు.

ఎన్టీఆర్‌ మీడియా ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

#Ntr Emk #Gemini #EvaruMeelo ##emk

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు