అదుర్స్ 2 సినిమా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చిన ఎన్టీయార్...

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన అదుర్స్ సినిమా( Adhurs ) సూపర్ హిట్ అయింది.

ఇక ఈ సినిమా సక్సెస్ తో జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ బాటపట్టాడు.

అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ సక్సెస్ లో బాట పట్టడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు.మరి ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా అదుర్స్ 2 సినిమా( Adhurs 2 movie ) రాబోతుంది అంటూ రీసెంట్ గా కోన వెంకట్ కూడా ఈ సినిమా స్టోరీని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది.

ఇక కోన వెంకట్ ( Kona Venkat )ఎన్టీఆర్ తో ఎలాగైనా సరే ఈ సినిమా చేయాలనే ఉద్దేశ్యం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమా మీద ఎన్టీఆర్ ప్రస్తుతం ఇంట్రెస్ట్ చూపించడం లేదనే వార్తలైతే వస్తున్నాయి.మరి దానికి కారణం ఏంటి అంటే అదుర్స్ సినిమా డైరెక్టర్ అయిన వి వి నాయక్ ప్రస్తుతం ఫామ్ లో లేడు ఇక ఆయనతో ఈ సినిమా చేసే అవకాశం లేదు.కాబట్టి ఈ సినిమాని కూడా పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.

Advertisement

ఇక ఈ సినిమాని కనక తీసినట్లైతే మరో కొత్త డైరెక్టర్ తో తీయాలనే ఉద్దేశ్యం లో ఎన్టీఆర్ అయితే ఉన్నాడు.కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ ఉన్న బిజీకి ఈ సినిమా చేయలేడనే చెప్పాలి.

ఇక ప్రస్తుతం ఎన్టీయార్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది.వరుసగా ఒక మూడు నాలుగు సంవత్సరాలు వరకు ఆయన ఖాళీ లేకుండా తన షెడ్యూల్ ని ఫుల్ బిజీ గా చేసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ప్రస్తుతం ఎన్టీయార్ దేవర సినిమా( Devara Movie ) చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ( Prashanth Neel)డైరెక్షన్ లో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు.ఇక దాని తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో కూడా మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !
Advertisement

తాజా వార్తలు