యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతోంది.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
బాహుబలి చిత్రం తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్పై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది.
ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ పాత్ర తారక్ కెరీర్లో ఓ మైలురాయిలా మిగలనుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాలోని తారక్ ఫస్ట్ లుక్ టీజర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ ఫస్ట్ లుక్ టీజర్లో హైలైట్‌గా నిలిచే అంశాలు ఏమిటనేవి ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ కావడంతో అవి వైరల్‌గా మారాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్ తెలంగాణ యాసలో మాట్లాడే డైలాగులతో రెడీ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పించనున్నట్లు తెలుస్తోంది.
తారక్ చెప్పే డైలాగులకు రోమాలు నిక్కబొడుస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 20న ఈ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను వచ్చే జనవరి 8న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.