ఆ అప్డేట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తారక్ ఫ్యాన్స్..!

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.

 Ntr Fans Waiting For Rrr Makers Official Announcement, Rrr, Ntr, Ram Charan, Ntr-TeluguStop.com

ఈయన నుండి సినిమాలు రాబోతున్నాయంటే అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే మరొక మూడు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు రాబోతుంది.మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఏం సర్ప్రైజ్ ఇస్తుందో అని ఫ్యాన్స్ ఇప్పటి నుండే ఆలోచిస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రాజమౌళి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడని ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి.అయితే అభిమానులు ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu Ntr, Ntr Fans, Ntrfans, Official, Rajamouli, Ram Charan-Movie

ఇప్పటి వరకు కేవలం గుసగుసలు మాత్రమే వినిపించాయి.కానీ ఎన్టీఆర్ ఈ మధ్యనే కరోనా బారిన పడ్డారు.దీంతో అభిమానులు పుట్టిన రోజు నాడు సర్ప్రైజ్ ఉంటుందో లేదో అనే ఆందోళన చెందుతున్నారు.ఈ సర్ప్రైజ్ ఉంటుందో లేదో ముందు రోజు మేకర్స్ ఇచ్చే అధికారిక ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన పోస్టర్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించ బోతున్నారని సమాచారం.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్ అన్ని నిలిచి పోయాయి.అందువల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా షూటింగ్ వాయిదా వేసుకున్నారు.

అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మారబోతుందని సమాచారం.మరి చూడాలి రాజమౌళి సర్ప్రైజ్ ఇస్తాడో లేదో అని.

ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube