మే నెల కోసం ఆసక్తిగా చూస్తున్న తారక్ ఫ్యాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను ఉగాది కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

 Ntr Fans Waiting For May 20-TeluguStop.com

‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అతిభారీ అంచనాలు ఏర్పడ్డాయి.

కాగా మార్చి 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా అతడి ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ లుక్ అదిరిపోయేలా ఉండటంతో ఈ ఫస్ట్ లుక్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ వీడియోలో చరణ్ లుక్‌కు జనం ఫిదా అవుతున్నారు.

ఇక చరణ్ పాత్రను తారక్ ఎలివేట్ చేసిన విధానం సూపర్‌గా ఉండటంతో ఈ వీడియోను చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

ఇక తారక్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తారక్‌ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ ఎప్పుడు వస్తుందా అని నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తారక్ పుట్టినరోజైన మే 20న ఈ చిత్ర యూనిట్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోది.

మరి తారక్‌ ఫస్ట్ లుక్‌ ఎలా ఉంటుందా, అది ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube