తారక్ తో అలాంటి సినిమా తీయొద్దని గురూజీని కోరుతున్న ఫ్యాన్స్...?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్లతో పాటు ఇతర ఇండస్ట్రీల్లోని స్టార్ డైరెక్టర్లు సైతం తారక్ తో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతూ ఉంటారు.

 Ntr Fans Suggestions To Trivikram, Trivikram, Ntr Fans, Tarak Role, Aravinda Sam-TeluguStop.com

తమ కెరీర్ లో ఒక్క సినిమా అయినా తారక్ తో చేయాలనుకునే దర్శకులు ఎంతో మంది ఉన్నారు.ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న తారక్ ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

అయితే తారక్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ తారక్ తో అరవింద సమేత లాంటి సినిమా మాత్రం తీయవద్దని కోరుతున్నారు.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కు చెందిన సినిమాల్లో ఇప్పటికే తారక్ బోలెడు సినిమాల్లో నటించాడని….

అరవింద సమేత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం వల్ల సినిమా హిట్టైనా బ్లాక్ బస్టర్ స్టేటస్ కు ఆమడ దూరంలోనే ఆగిపోయిందని తారక్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

త్రివిక్రమ్ స్టైల్ సినిమాలో తారక్ ను చూడాలనుందని… ఎప్పుడూ కొత్త పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చే తారక్ ను త్రివిక్రమ్ సినిమాలో హీరోలా చూడాలని ఉందని చెబుతున్నారు.

మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా తారక్ ను కొత్తగా ఆవిష్కరించాలని సూచిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ తరువాత తారక్ రేంజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పాన్ ఇండియా కథను ఎంచుకుంటే మంచిదని చెబుతున్నారు.

అరవింద సమేత తమకు ఫుల్ మీల్స్ లా అనిపించినా… ఇతర హీరోల అభిమానులకు పెద్దగా కిక్ ఇవ్వలేదని… గతంలో తారక్ ను ఎప్పుడూ చూడని పాత్రల్లో చూడాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు.మరి తారక్ అభిమానుల ఆశలను దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ లో తారక్ పాత్ర షూటింగ్ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాకు తారక్ పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube