జై లవకుశ తో మరో రికార్డును కొట్టబోతున్న నందమూరి అభిమానులు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.కొన్ని రోజుల క్రితం ప్రసాద్‌ ఐమాక్స్ లో టెంపర్‌ సినిమా స్క్రీనింగ్‌ చేసిన అభిమానులు ఈసారి జై లవుకుశ సినిమాను ప్రసాద్‌ ఐమాక్స్‌ లో ప్రత్యేక షో వేయిస్తున్నారు.

 Ntr Fans Jai Lavakusha Special Show In Prasads ,tollywood,jr Ntr ,jaimlakusha,ra-TeluguStop.com

ఇలాంటి ఫ్యాన్స్‌ షో లకు కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ రావడం చాలా గగనం.కాని ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం ఈ సినిమా ను భారీ ఎత్తున చూసేందుకు సిద్దం అయ్యారు.

ప్రస్తుతం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి.కనుక సినిమా కు మొత్తం 50 శాతం టికెట్లు మూడు రోజుల ముందే అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది.

చాలా మంది అభిమానులు ఇంకా నిరాశ వ్యక్తం చేస్తున్నారు.అభిమానుల షో కు కొందరు ప్రముఖులు కూడా హాజరు అయ్యే అవకాశం ఉంది.

కనుక భారీ ఎత్తున అభిమానులు ఈ షో కోసం ఆసక్తి చూపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నందమూరి అభిమానులు ఇలాంటి రికార్డులు గతంలోనే నమోదు చేశారు.

టెంపర్‌ సినిమాను పెద్ద ఎత్తున స్క్రీనింగ్‌ చేశారు.ఆ సమయంలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున ప్రత్యేక షో కు హాజరు అయ్యారు.

ఎన్టీఆర్‌ సినిమాలు విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది.కనుక అభిమానులు థియేటర్ లో ఆయన సినిమాను చూడాలనే ఉద్దేశ్యంతో ఇలా ప్రత్యేక షో లు వేస్తున్నారు.

బాబీ దర్శకత్వంలో రూపొందిన జై లవకుశ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఎన్టీఆర్‌ ఆ సినిమాలో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు.

ఈ తరం హీరోల్లో మూడు విభిన్న పాత్రల్లో నటించిన ఘనత ఎన్టీఆర్‌ కు దక్కింది.కళ్యాణ్‌ రామ్‌ నిర్మించిన ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది.

ఈ సినిమాలో హీరోయిన్స్ గా రాశి ఖన్నా మరియు నివేదా థామస్‌ నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా లో ఎన్టీఆర్ ఒక పాత్రను నెగటివ్‌ షేడ్స్‌ తో చేసిన విషయం తెల్సిందే.

ఎన్టీఆర్‌ నట విశ్వరూపంను చూపిన ఈ సినిమా ను అభిమానులు ఎప్పటికి మర్చి పోలేరు.అందుకే ఈ సినిమాను మరోసారి చూడాలనే ఉద్దేశ్యంతో ప్రసాద్‌ ఐమాక్స్ లో అభిమానుల వరకు ప్రత్యేక షో వేయించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube