చంద్రబాబు కు ఊహించని షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..!!

పంచాయతీ ఎన్నికలలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం లో వైసీపీ మద్దతుదారులు భారీ స్థాయిలో గెలిచిన సంగతి తెలిసిందే.ఈ దెబ్బతో కుప్పం పర్యటన చేపట్టిన చంద్రబాబు అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 Ntr Fans Gave An Unexpected Shock To Chandrababu-TeluguStop.com

అదేవిధంగా టిడిపి క్యాడర్ తో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి అదేరీతిలో అందరి సమస్యలు తెలుసుకోవటానికి చంద్రబాబు ప్రతి ఒక్కరి తో మంతనాలు జరపడం జరిగింది.

ఇలాంటి తరుణంలో చంద్రబాబుకి ఊహించని షాక్  జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ఎదురైంది.

 Ntr Fans Gave An Unexpected Shock To Chandrababu-చంద్రబాబు కు ఊహించని షాక్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేటర్ లోకి వెళ్తే టిడిపి పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పైకి రావాలంటే కచ్చితంగా ఎన్టీఆర్ ని రంగంలోకి దింపాలని అప్పుడే పుంజుకునే అవకాశం ఉంటుందని బాబుకి స్పష్టం చేయడం జరిగింది.

దానికి చంద్రబాబు కాన్వాయ్ పై ఉండి సదరు వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు తల ఊపుతూ ఉన్నారు.తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.2009 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి పార్టీ తరుపున ప్రచారానికి దిగిన ఎన్టీఆర్ నీ తర్వాత చంద్రబాబు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు.

మరో పక్క ఎన్టీఆర్ కూడా సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఆ తర్వాత అనేక ఎన్నికలలో ఎన్టీఆర్ ప్రస్తావన వచ్చినా గాని .అంతంతమాత్రంగానే పార్టీ కేడర్ పట్టించుకున్న దాఖలాలు.అయితే తాజాగా చంద్రబాబు ఎదుటే మరోసారి ఎన్టీఆర్ ప్రస్తావన రావటంతో ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

#Kuppam #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు