తగ్గితే ఊరుకోమంటున్న ఫ్యాన్స్

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ భారతేదశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ntr Fans Condition For Rajamouli, Ntr, Rajamouli, Rrr, Ram Charan, First Look-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

కాగా ఇటీవల చరణ్ పుట్టినరోజున అతడి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా అది సెన్సేషనల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది.

ఇక మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అతడి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అయ్యింది.అయితే ఈ ఫస్ట్ లుక్ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ టీమ్‌ను పలు కోరికలు కోరుతున్నారు.

చరణ్ పాత్ర ఫస్ట్ లుక్ వీడియోలో తారక్ వాయిస్‌కే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని, ఇప్పుడు తారక్ ఫస్ట్ లుక్ వస్తుండటంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయని వారు అంటున్నారు.

చరణ్ ఫస్ట్ లుక్‌కు ఏమాత్రం తగ్గకుండా తారక్ ఫస్ట్ లుక్‌ను డిజైన్ చేయాలని, ఇక మే 20న సోషల్ మీడియాను అల్లాడించడం తమ వంతని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఆర్ఆర్ఆర్‌లో తారక్ ఫస్ట్ లుక్ కోసం ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, అందాల భామ ఆలియా భట్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాను డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube