ఎన్టీఆర్ బర్త్‌ డే కు ఫ్యాన్స్ చేయబోతున్నదేంటో తెలిస్తే సెల్యూట్‌ చేస్తారు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బర్త్‌ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆయన బర్త్‌ డే అంటూ అభిమానులకు చిన్న సైజు పండుగే.

 Fans To Donate Oxygen Concentrators On Ntr Birthday, Ntr Fans, Ntr Birthday Cele-TeluguStop.com

సోషల్‌ మీడియాలో ఎన్టీఆర్‌ బర్త్‌ డే హ్యాష్ ట్యాగ్‌ లు పోస్టర్ లు ఇలా ఎన్నో విధాలుగా ట్రెండ్‌ నడుస్తూ ఉంటుంది.యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఈ ఏడాది కూడా తమ సందడిని కొనసాగించాలని భావిస్తున్నారు.

ఎన్టీఆర్‌ అభిమానులు గతంలో ఎన్నో సార్లు పుట్టిన రోజు సందర్బంగా సేవా కార్యక్రమాలు చేశారు.ఈ సారి కూడా ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సిద్దం అయ్యారు.

అభిమానులు పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేసి ఆక్సీజన్ సిలిండర్‌ లను మొదలుకుని కరోనా పేషంట్లకు ఆహారం అందించే వరకు ఎన్నో కార్యక్రమాలను చేయబోతున్నారు.
ఈనెల 20వ తారీకున ఎన్టీఆర్‌ పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెల్సిందే.

ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వారు సోషల్‌ మీడియా ద్వారా కూడా సహాయం కావాలంటూ అభ్యర్థించిన వారికి సాయంగా నిలుస్తున్నారు.సమాచారంను షేర్‌ చేయడంతో పాటు సందేహాలు ఉన్న వారికి మరియు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తు తమ వంతు సహకారం అందిస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా అంతకు మించి అన్నట్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ అభిమానులు ఈ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లుగా చెబుతున్నారు.

గతంలో మాదిరిగా ప్లెక్సీలను ఏర్పాటు చేయడం కాకుండా కరోనా పేషంట్స్‌ కు సాయం చేయాలి అనే నిర్ణయం నిజంగా అభినందనీయం. ఇక ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా జక్కన్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి పోస్టర్ ను విడుదల చేయబోతున్నారు.

అలాగే కొరటాల కూడా ఏదో ప్లాన్‌ చేస్తాన్నాడనే సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube