కొరటాల గారు ఇలా చేశారేంటండీ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా రాబోతుంది.ప్రస్తుతం చేస్తున్న ఆర్‌ ఆర్‌ ఆర్‌ పూర్తి అయిన వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో మరో జనగా గ్యారేజ్ ను చేసేందుకు ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడు.

 Ntr Fans Angry On Koratala Shiva About New Movie , Acharya, Korata Shiva, Ntr, N-TeluguStop.com

ఇది ఎన్టీఆర్‌ 30వ సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.జనతా గ్యారేజ్ సక్సెస్‌ అయ్యింది కాని ఇండస్ట్రీ హిట్‌ రేంజ్ లో మాత్రం సక్సెస్‌ ను దక్కించుకోలేదు.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు టార్గెట్‌ గా ఈ సినిమా రాబోతుంది అంటూ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.ఇలాంటి సమయంలో ఎన్టీఆర్‌ అభిమానులు కొందరు కొరటాల శివపై కోపంతో ఉన్నారు.

నేడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు ఈ సందర్బంగా కొరటాల శివ దర్శకత్వం లో ఎన్టీఆర్‌ చేస్తున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు టైటిల్‌ ను రివీల్‌ చేస్తారనే వార్తలు వచ్చాయి.కాని తీరా చూస్తే ఓ ఫొటోను షేర్‌ చేసి బర్త్‌ డే శుభాకాంక్షలను కొరటాల శివ చెప్పేశాడు.

ఎన్టీఆర్‌ 30 అంటూ పోస్టర్‌ పై ఎన్టీఆర్‌ రెగ్యులర్‌ ఫొటోను షేర్‌ చేశాడు.ఎన్టీఆర్‌ 30 నుండి కొత్తగా ఏదైనా అప్ డేట్‌ వస్తుందని ఆశించిన వారికి నిరాశ మిగిలింది.

పెద్ద ఎత్తున ఈ సినిమా పై అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ బర్త్ డే సందర్బంగా టైటిల్‌ ను అనౌన్స్ చేస్తే బాగుండేది.కాని కొరటాల శివ మాత్రం ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఆచార్య మీదే ఉన్నదని.

ప్రస్తుతానికి వేరే సినిమా కు సంబంధించిన ఎలాంటి విషయంలో కూడా తల దూర్చేందుకు ఆసక్తి లేడని తెలుస్తోంది.అందుకే ఎన్టీఆర్‌ సినిమా గురించి ఇప్పట్లో కొరటాల శివ తలదూర్చే అవకాశం కనిపించడం లేదు.

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ తో పాటు 31వ సినిమా గా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్నట్లుగా అధికారికంగా వార్తలు వచ్చాయి.ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తో సమాంతరంగా ప్రశాంత్‌ నీల్‌ మూవీని చేస్తాడేమో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube