జెమిని టీవీపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ఫైర్‌

ఒక వైపు స్టార్‌ మా వారు బిగ్‌ బాస్‌ సీజన్ 5 ను అధికారికంగా ప్రకటించారు.కాని ఇప్పటి వరకు జెమిని టీవీ వారు మాత్రం ఎవరు మీలో కోటీశ్వరులు కు సంబంధించిన అప్ డేట్‌ ను ఇవ్వలేదు.

 Ntr Fans Angry On Gemini Tv For Not Announcing Emk-TeluguStop.com

సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ఎన్టీఆర్‌ అభిమానులు ఎవరు మీలో కోటీశ్వరులు షో కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.షో కు సంబంధించిన స్టిల్స్ మరియు ప్రోమోలు విడుదల చేస్తున్న జెమిని వారు ఇప్పటి వరకు షో టెలికాస్ట్‌ తేదీని మాత్రం ప్రకటించడం లేదు.

ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అంటూ అభిమానులు సీరియస్ అవుతున్నారు.షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని వారు వీరు చెబుతుంటే తెలుస్తోంది.

 Ntr Fans Angry On Gemini Tv For Not Announcing Emk-జెమిని టీవీపై ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో ఫైర్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని ఇప్పటి వరకు జెమిని టీవీ వారు మాత్రం అధికారికంగా చెప్పలేదు.మొదటి ఎపిసోడ్‌ కు సంబంధించిన ఫొటోలు మరియు వీడియోలను సోషల్‌ మీడియాలో అభిమానులు అనధికారికంగా షేర్‌ చేస్తున్నారు.

కాని జెమిని వారు మాత్రం ఇంకా ఏమీ చెప్పడం లేదు.

Telugu #emk, Bigg Boss, Film News, News In Telugu, Ntr-Movie

ఒక వైపు బిగ్‌ బాస్‌ షో ప్రారంభం అవుతున్నట్లుగా ప్రకటన వచ్చింది.మరో వైపు ఈ షోకు సంబంధించిన స్టిల్స్ వచ్చాయి.రెండు షో లు సమాంతరంగా వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.

ఇలా రావడం వల్ల ఖచ్చితంగా ఏదో ఒక షోకు గట్టిగానే దెబ్బ పడే అవకాశం ఉంది.రెండు షో లు వేరు వేరు టైమింగ్స్ లో వచ్చినా కూడా ప్రభావం ఉంటుందని అంటున్నారు.

అందుకే ఒక సీజన్ పూర్తి అయిన తర్వాత మరో షో సీజన్ ను మొదలు పెడితే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.బిగ్‌ బాస్ మరియు ఎవరు మీలో కోటీశ్వరులు రెండు కూడా మంచి బజ్‌ ఉన్న షో లే.కనుక రెండు కూడా ప్రేక్షకులు చూడాలని కోరుకుంటారు.అలాంటి షో లను ఒకే సమయంలో లేదా ఒకే రోజున ప్రసారం చేస్తే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కనుక జెమిని టీవీ వారిని ముందుగానే షో ను టెలికాస్ట్ చేయాల్సిందిగా అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

#Emk #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు