ఎవరు మీలో కోటిశ్వరులు లో పాల్గొనాలనుకుంటున్నారా. అయితే ఇలా చేయండి

ఒకప్పుడు సినీ తారలు బుల్లి తెర మీద నటించడమంటే పెద్దగా ఆసక్తి చూపించే వారు కాదు సరికదా ఏదో పెద్ద అవమానంగా భావించే వారు.ఇక వెండి తెర నుండి బుల్లి తెర మీదికి ఏ నటుడైనా వచ్చాడంటే ఇక ఆ నటుడు వెండి తెర మీద నటించడం అసాధ్యమై పోయేది.

 How To Register Ntr Evaru Meelo Koteswarulu Show, Evaru Meelo Koteswarulu Show,-TeluguStop.com

అందుకే అవకాశాలు రాకున్నా సరే వెండి తెరపై చిన్న చిన్న పాత్రలు చేస్తూనే అవకాశాల కోసం వెతికే వారు.కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

వెండి తెర, బుల్లి తెర కలిసి పోయింది.ఇక పెద్ద రియాలిటీ షోలు రావడం వాటికి ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతుండడంతో వెండి తెర మొత్తం బుల్లితెర వైపు కన్నేసింది.

తద్వారా సూపర్ స్టార్ లు సైతం రియాలిటీ షోలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.అయితే మొట్ట మొదటగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ హోస్ట్ రియాలిటీ షో మీలో ఎవరు కోటేశ్వరులు.

ప్రస్తుతం ఆ రియాలిటీ షోను ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం కాబోతోంది.సామాన్యుల జీవితాలను ఆవిష్కరిస్తూ వారి జీవితాన్ని ప్రపంచానికి చూపిస్తూ వారిని కోటేశ్వరులను చేయడమే ఈ రియాలిటీ షో ప్రధాన లక్ష్యం.

అయితే ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి అని చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి.అయితే ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.మొదటగా మీరు www.sunnetwork.in వెబ్ సైటులో ఎవరు మీలో రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేసి మీ పేరు, మీ అడ్రస్, తదితర వివరాలను అందులో పొందుపరచాలి.ఆ తరువాత మీకు అక్కడ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు.వాటికి సమాధానమివ్వాలి.అప్పుడు ఎవరు మీలో కోటీశ్వరుడు టీం అర్హులైన వారిని సెలెక్ట్ చేసి అర్హత సాధించిన వారిని ఆడిషన్స్ కి పిలుస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube