ఎన్టీఆర్‌ షో చివరి ఎపిసోడ్ ప్లానింగ్ ఇదే.. డేట్ కూడా ఫిక్స్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్లాప్ షో ఎవరు మీలో కోటీశ్వరులు కు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది.ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే డిసెంబర్ వరకు ఈ షో ను కంటిన్యూ చేయాల్సి ఉంది.

 Ntr Emk Show Last Episode Date Confirm-TeluguStop.com

కాని రేటింగ్‌ సరిగా రాక పోవడం వల్ల ముగించేశారు.ఇప్పటికే ఎన్టీఆర్‌ షూటింగ్‌ ను ముగించేశాడు.

ఇప్పటికే షూట్‌ చేసిన ఎపిసోడ్స్ ను టెలికాస్ట్‌ చేస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దీపావళికి రావాల్సిన మహేష్‌ బాబు ఎపిసోడ్‌ ను సీజన్ చివరి ఎపిసోడ్‌ గా టెలికాస్ట్‌ చేయాలని భావిస్తున్నారు.

 Ntr Emk Show Last Episode Date Confirm-ఎన్టీఆర్‌ షో చివరి ఎపిసోడ్ ప్లానింగ్ ఇదే.. డేట్ కూడా ఫిక్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరి ఎపిసోడ్‌ కు మంచి రెస్పాన్స్ రావడం ద్వారా కాస్తలో కాస్త అయినా ఊరట దక్కుతుంది అనే ఉద్దేశ్యంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నారు.బాక్సాఫీస్ ను షేర్ చేయగల సత్తా ఉన్న ఎన్టీఆర్‌ కు బుల్లి తెర రేటింగ్‌ ను ఈ షో తో అల్లాడించలేక పోయాడు.

దాంతో ఈ సీజన్ ను నిరాశతో మద్యలోనే వదిలేస్తున్నారు.

ఇక ఈ సీజన్ ను నవంబర్‌ 18 ఎపిసోడ్ తో ముగించబోతున్నారు.

ఎపిసోడ్‌ లో మహేష్ బాబు కనిపించబోతున్నాడు.మహేష్‌ బాబు తో షూటింగ్‌ చేసి నెల రోజులు దాటింది.

మంచి సమయం కోసం ఆయన ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేస్తున్నారు.మంచి అంచనాలున్న ఈ ఎపిసోడ్‌ పై జెమిని చాలా ఆశలు అంచనాలు పెట్టుకుంది.

ఇప్పటి వరకు సెలబ్రెటీ గెస్ట్‌ ఎపిసోడ్స్ కు మాత్రమే ఏమైనా రేటింగ్‌ వచ్చింది తప్ప మిగిలిన ఏ ఒక్క ఎపిసోడ్స్ కు కూడా రేటింగ్‌ రాలేదు అంటూ స్వయంగా జెమిని వర్గాల వారు ఆఫ్‌ ది రికార్డు చెబుతున్నారు.పెట్టిన ఖర్చుకు వస్తున్న ఆదాయంకు చాలా వ్యత్యాసం ఉండటంతో ఖచ్చితంగా జెమిని టీవీకు పెద్ద బొక్క అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

బిగ్గెస్ట్‌ సక్సెస్ లు అయిన సీరియల్స్ తో పోల్చితే కనీసం ఈ ఎన్టీఆర్ షో రేటింగ్ దారుణంగా ఉందంటూ బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#Emk #Gemini TV #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube