ఎన్టీఆర్ కి బాలయ్య భయపడ్డాడా ?

పండగ సీజన్లో సినిమాలు విడుదల చేయడం నందమూరి బాలకృష్ణకి ముందు నుంచి అలవాటు.దసరా, సంక్రాంతి సీజన్లో ఎన్నో బ్లాక్బస్టర్స్ అందించారు బాలయ్య బాబు.

 Ntr Effect : Paisa Vasool Moves Out From The Clash ?-TeluguStop.com

ఈ ఏడాది కూడా సంక్రాంతికే వచ్చి గౌతమీపుత్ర శాతకర్ణి రూపంలో మంచి సక్సెస్ ని సాధించారు.అదే ఊపులో దసరాకి పైసా వసూల్ ని దింపుతున్నట్లు ప్రకటించారు.

దసరా బరిలో దూకిన మొదటి సినిమా ఇదే.సెప్టెంబర్ 29న విడుదల చేస్తామని ఈ యూనిట్ ప్రకటించే సమయానికి ఇటు స్పైడర్ కాని, అటు జై లవ కుశ కాని దసరా బరిలో లేవు.స్పైడర్ జూన్ లేదా జులై లో వస్తుందనుకున్నారు.మహా అయితే ఆగస్టు లో విడుదల అన్నారు.ఇక జై లవ కుశ సెప్టెంబర్ మొదటివారంలోనే రావాల్సిన సినిమా.కాని స్పైడర్ దసరాకి షిఫ్ట్ అయితే, అనూహ్యంగా జై లవ కుశ కూడా దసరా సీజన్ పై కన్నేసింది.

మిగితా పెద్ద సినిమాలు దగ్గరలో లేకపోవడంతో పండగ సీజన్ ని డామినేట్ చేద్దామనుకున్న బాలకృష్ణ ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

బయ్యర్లు తెగ భయపడుతున్నారట.

అసలే పూరి జగన్నాథ్ ఫామ్ లో లేడు.వరుసగా మూడు డిజాస్టర్లు.

ఇటు గౌతమీపుత్ర శాతకర్ణి కూడా పేరుకే హిట్ కాని బయ్యర్లకు పెద్ద మిగిల్చింది లేదు.ఇలాంటి సమయంలో స్పైడర్, జై లవ కుశ లాంటి భారి సినిమాలతో పోటి ఎందుకు అని పంపిణిదారులు పూరిని సంప్రదించారట.

మహేష్ – ఎన్టీఆర్ పోరులో కావాల్సిన థియేటర్లు దొరకడం కూడా కష్టం, సోలోగా రావడమే బెటర్, విడుదల తేది మార్చాల్సిందే అంటూ మొండికేసారట.ఇదే విషయం బాలకృష్ణకి కూడా చెబితే ఆయన కూడా పరిస్థితిని అర్థం చేసుకోని, విడుదల తేది మార్పుకి ఒప్పుకున్నారట.

దాంతో పైసా వసూల్ అనుకున్న సమయానికి కన్నా ముందే, సెప్టెంబర్ మొదటివారంలోనే వస్తుందని ట్రేడ్ లో టాక్ నడుస్తోంది.

నిజానికైతే పైసా వసూల్ షూట్ మొత్తం ఏ నెలాఖరులోనే అయిపోతుందట.

మిగితా పెద్ద సినిమాలు లేవు కదా అని దసరాకి వస్తున్నట్లు చెప్పారు.ఎంతైనా పండగ వాతావరణంలో పైసలు ఎక్కువ వసూల్ చేయొచ్చు కదా.కాని ఇంతలో రెండు భారి సినిమాలు వచ్చి కూర్చున్నాయి.బయ్యర్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube