తారక్ డైనమిక్ లుక్.. కోరమీసంతో కొమరం భీం.. పిక్ వైరల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ నందమూరి అభిమానులను ఫుల్ జోష్ లో నింపింది.ఈయన డైనమిక్ లుక్ లో దర్శనం ఇచ్చి అభిమానులందరినీ ఆకట్టు కుంటున్నాడు.

 Ntr Dynamic Look Photo Goes Viral On Social Media, Ntr ,ntr Dynamic Look, Ntr Ne-TeluguStop.com

తారక్ స్టైలిస్ట్ అశ్విన్ తాజాగా ఎన్టీఆర్ స్టైలిష్ పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ పిక్ కాస్త వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో తారక్ నలుపు రంగు సూట్ ధరించి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

అంతేకాదు ఆయన మెలి తిరిగిన కోర మీసాలు, ఆయన కలర్ కు సూట్ అయ్యే విధంగా నలుపు రంగు సూట్, టై, బూట్లు కూడా ధరించి క్లాసీ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ కొమరం భీం లుక్ నందమూరి అభిమానులకు కిక్ ఇస్తుంది.

ఎన్టీఆర్ రాయల్ పిక్ నిముషాల్లోనే వైరల్ అయ్యింది.అభిమానులు తమ అభిమాన హీరో రాయల్ లుక్ ను షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేసారు.

Telugu Koratala Shiva, Ntr Dynamic, Ntr, Tarak-Movie

ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే.టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుంటే.

ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

ఇక ఈ సినిమా జనవరి 7న రిలీజ్ అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

ఈసారి అయినా రిలీజ్ అవుతుంది అనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు.ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే కొరటాల ఈ సినిమా షూటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు.త్వరలోనే షూట్ స్టార్ట్ కాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube