తారక్‌తో మహేష్‌కు చెడిందా..?  

Ntr Did Not Respond On Sarileru Neekevvaru-allu Arjun,mahesh Babu,ntr,sarileru Neekevvaru

తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు తొలిరోజే పాటిజివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా ఈ సినిమా దుమ్ములేపుతోంది.

Ntr Did Not Respond On Sarileru Neekevvaru-allu Arjun,mahesh Babu,ntr,sarileru Neekevvaru-Telugu Gossips Ntr Did Not Respond On Sarileru Neekevvaru-allu Arjun Mahesh Babu Ntr Sarileru Neekevvaru-NTR Did Not Respond On Sarileru Neekevvaru-Allu Arjun Mahesh Babu Ntr Neekevvaru

కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ సినిమా కలెక్షన్లు చూసి అందరూ చిత్ర యూనిట్‌తో పాటు మహేష్ బాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అయితే టాలీవుడ్‌లో ఓ స్టార్ హీరో సినిమా సక్సెస్ కొడితే ఇతర స్టార్స్ వారిని పొగడటం సర్వసాధారణం.

కాగా గతంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయినప్పుడు మహేష్‌ను మెచ్చుకున్నవారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు.

కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా ఇంతటి ప్రభంజన సృష్టిస్తున్నా తారక్ ఒక్క మాట కూడా అనలేదు.

దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మహేష్ బాబుల మధ్య ఏదో జరిగిందనే వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది.దీనికి తోడు అల వైకుంఠపురములో సినిమా సక్సెస్ తనకు సంతోషం కలిగించిందంటూ తారక్ ట్వీట్ చేయడంతో, మహేష్‌కు తారక్‌తో నిజంగానే చెడిందా అనే డౌట్ అందరిలో మొదలైంది.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే తారక్, మహేష్‌లలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

తాజా వార్తలు

Ntr Did Not Respond On Sarileru Neekevvaru-allu Arjun,mahesh Babu,ntr,sarileru Neekevvaru Related....