త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టిన తారక్... కారణం అదేనంట

తారక్ కి అరవింద సమేత లాంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఆర్ఆర్ఆర్ తర్వాత సినిమా చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యాడు.స్టొరీ కూడా పూర్తిగా వినకుండానే త్రివిక్రమ్ మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ కి ఒకే చెప్పడంతో అఫీషియల్ గా ప్రకటన కూడా చేసేశారు.

 Ntr Did Not Impressed Trivikram Script-TeluguStop.com

అయితే ఈ మధ్యలో కరోనా రావడం, ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఆలస్యం కావడం జరిగింది.త్రివిక్రమ్ కూడా తారక్ కోసం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథని సిద్ధం చేసి ఎన్టీఆర్ కి వినిపించాడు.

అయితే ఏమైందో కాని ఉన్నపళంగా ఇప్పుడు తారక్ నెక్స్ట్ సినిమా రేస్ నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ అవుట్ అయ్యాడు.కొరటాల శివ లైన్ లోకి వచ్చేశాడు.

 Ntr Did Not Impressed Trivikram Script-త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టిన తారక్… కారణం అదేనంట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో కొరటాలతో నెక్స్ట్ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసేశారు.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్, కొరటాల స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు.

మూవీ ఎనౌన్స్ మెంట్ ఒకే కాని త్రివిక్రమ్ సినిమాని తారక్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం ఏంటి అనే చర్చ ఇప్పుడు టాలీవుడ్ లో నడుస్తుంది.

అరవింద సమేత, అల వైకుంఠపురంలో సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మాటల మాంత్రికుడు చెప్పిన కథని పక్కన పెట్టి కొరటాలతో ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకి కమిట్ అవ్వడంపై ఇప్పుడు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటున్నాడు.ఈ నేపధ్యంలో నెక్స్ట్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలని అనుకుంటున్నాడు.

అయితే త్రివిక్రమ్ చెప్పిన స్టొరీ బాగున్నా కూడా పక్కా తెలుగు నేటివిటీతో కేవలం టాలీవుడ్ వరకే పరిమితం అయ్యే విధంగా ఉందని, అయితే త్రివిక్రమ్ ఈ కథని పాన్ ఇండియా రేంజ్ లో రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేసిన యూనివర్శల్ అప్పీల్ లేదనే ఉద్దేశ్యంతోనే దానిని పక్కన పెట్టినట్లు టాక్ వినిపిస్తుంది.కెరియర్ ని పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్న ఈ సమయంలో మళ్ళీ పాన్ ఇండియా నుంచి ఒకే బాషకి పరిమితమయ్యే సబ్జెక్ట్ తో సినిమా చేయడం కరెక్ట్ కాదని భావించి తారక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.

త్రివిక్రమ్ కూడా తారక్ నిర్ణయాన్ని గౌరవించి అదే కథని మహేష్ బాబుకి చెప్పి ఒకే చేయించుకున్నట్లు బోగట్టా.

.

#Koratala Siva #Pan India #Kalyan Ram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు