టీడీపీ లో ఎన్టీఆర్ డిమాండ్ ? బాబు నిర్ణయం ఏంటో ? 

తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే వస్తోంది.గతంతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

 Ntr Demand In Tdp What Is The Chandrababu Desistion-TeluguStop.com

స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలలో టీడీపీకి ఎదురైన ఘోర ఫలితాలే దీనికి కారణంగా కనిపిస్తోంది.ఇప్పుడు జరగబోయే పరిషత్ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది అంటే, ఆ పార్టీ ఎంతగా భయంతో ఉంది అనే విషయం అందరికీ అర్థమైపోయింది.

తిరుపతి లోక్ సభ ఎన్నికలలో టీడీపీకి సీన్ లేదనే విషయం అందరికీ అర్థమైపోయింది.గతంతో పోలిస్తే చంద్రబాబు పార్టీపై పట్టు కోల్పోవడం, గతంలో పార్టీ లో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడం,  ఎవరికి వారు తామే గొప్ప లీడర్లు అన్నట్లుగా వ్యవహరిస్తుండడం ఇలా ఎన్నో కారణాలతో టీడీపీకి ఈ పరిస్థితి దాపురించింది.

 Ntr Demand In Tdp What Is The Chandrababu Desistion-టీడీపీ లో ఎన్టీఆర్ డిమాండ్ బాబు నిర్ణయం ఏంటో  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదీ కాకుండా రాజకీయంగా మరింత బలోపేతం అవ్వడం,  సంక్షేమ కార్యక్రమాలతో జనాల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం అవుతున్నాయి.అలాగే టీడీపీ లో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడం, ఇతర నాయకులకు ప్రాధాన్యం పెద్దగా లేకపోవడం తో యూత్ ని ఆకర్షించ లేక టీడీపీకి ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

బలమైన నాయకుడిగా లోకేష్ ను చంద్రబాబు ప్రమోట్ చేస్తున్నా, ఆయన నాయకత్వాన్ని ఒప్పుకునే వారు టిడిపిలోనే పెద్దగా లేరు.అది కాకుండా పదేపదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన టీడీపీలో వస్తోంది.

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీని గట్టెక్కించాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వాల్సిందేనని,  ఆయన ద్వారానే పార్టీకి పూర్వవైభవం దక్కుతుంది అని పార్టీ కేడర్ బలంగా ఫిక్స్ అవడంతో బహిరంగంగానే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వినిపిస్తున్నారు.

Telugu Bjp, Janasena, Juniour Ntr, Kuppam, Nara Lokesh, Pavan Kalyan, Tdp Troubled-Telugu Political News

జూనియర్ ఎన్టీఆర్ ను  టీడీపీలో యాక్టివ్ చేస్తే లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా ఇబ్బందులు ఏర్పడతాయనే ఉద్దేశంతో బాబు ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ రాకను ఒప్పుకునేలా కనిపించడం లేదు.పార్టీలో ఒడుదొడుకులు సర్వసాధారణమని , మరి కొద్ది కాలానికి అయినా టీడీపీ పుంజుకుంటుందని,  2024 నాటికి తయారవుతుందని, అనవసరంగా జూనియర్ ను పార్టీలో యాక్టివ్ చేసి , అనవసర తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారట.అందుకే అటు కుప్పంలో  కానీ, ఇంకా అనేక చోట్ల కానీ చంద్రబాబు ముందు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెలుగు తమ్ముళ్లు తీసుకువచ్చినా, బాబు సైలెంట్ గా ఉండి పోవడానికి కారణం ఇదేనట.

#Juniour NTR #TDP Troubled #Nara Lokesh #Pavan Kalyan #Janasena

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు