అచ్చెన్నాయుడికి చెక్ పెట్టనున్న ఎన్టీఆర్ కూతురు..       2018-04-13   03:32:12  IST  Bhanu C

కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు అనడంలో సందేహం లేదు..ఎందుకంటే తన తండ్రి మంరణం తరువాత చంద్రబాబు తో వచ్చిన విభేదాలతో కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఆమె ఆనతి కాలంలోనే కాంగ్రెస్ లో తిరుగులేని నేతగా మారారు..కేంద్ర మంత్రిగా తన సత్తా చాటారు..ఏకధాటిగా మాట్లాడగల నేర్పు ఆమెకి ఎన్నో అవకాశాలని కలిగించింది…అంతేకాదు ఎన్టీఆర్ కుమార్తె అన్న కోణంలో కూడా ప్రజలు ఆమెని ఆదరించారు..

-

- Telugu


అయితే విభజన తరువాత అందరి లాగానే కాంగ్రెస్ కి రాం రాం చెప్పిన పురంధరేశ్వరి బిజెపి తో జతకట్టారు…అంతేకాదు బిజెపి లో కూడా ఎంతో కీలకంగా మారారు ఆమె..అయితే ఎప్పటిలాగానే పార్లమెంటు వైపు చూస్తారు అనుకున్న ఆమె అనూహ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ రాజకీయాలలో ఉండాలని నిర్ణయించుకున్నారు..అయితే ఈ విషయం గోప్యంగా ఉంచినా సరే తాజా సమాచారం మేరకు ఆమె ఏకంగా అధికార పార్టీ మంత్రి నియోజకవర్గం మీదనే కన్నేశారు..సదరు నేతని డీ కొట్టడానికి సర్వం సిద్దం చేసుకున్నారు..ఇంతకీ ఆ నేత ఎవరు..? పురంధరేశ్వరి ఎంతవరకూ అక్కడ సక్సెస్ అవ్వగలదు అనే వివరాలలోకి వెళ్తే..

బీజేపీ నేత పురంధేశ్వరి 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయనున్నట్లు తెలుస్తోంది…అందలో బాగంగా ఆమె ఒక నియోజకవర్గాన్ని సైతం ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తోంది…తన సొంత జిల్లాలను కాదని ఏకంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లుగా సమాచారం అయితే ఒకప్పుడు తన తండ్రిని ఆదరించిన టెక్కలి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారని..ఇందుకోసం ఇప్పటికే బీజేపి అధిష్టానంతో మంతనాలు జరిపారని తెలుస్తోంది..అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచీ అధికార టిడిపి పార్టీ మంత్రి అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే అయితే అచ్చెన్న ని డీ కొట్టడానికి ఆమె పలు కారణాలు కూడా వెల్లడించారని అంటున్నారు అవేమిటంటే..

టెక్కలి నుంచీ ప్రాతినిధ్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు పై ఇప్పటికే అక్కడ ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది…పైగా చెప్పుకోదగ్గ అభివృద్ధి కోడా అచ్చెన్న చేసింది ఏమీ లేదు…అయితే ఇప్పుడు ఆమెకి అక్కడ ఉన్న బలం అంతా ఒక్కటే తన తండ్రి మీద అక్కడ వారికి ఉన్న అపారమైన ప్రేమాభిమానాలు మరియు అచ్చెన్న పై ఉన్న వ్యతిరేకత ఈ రెండు అంశాలు పురంధరేశ్వరికి కలిసి రానున్నాయి..అయితే టీడీపీ అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో పురంధేశ్వరి ఎలాంటి వ్యూహంతో ఆ సీటును ఎంచుకున్నారన్నది అర్థం కావడంలేదని స్థానిక నేతలు అంటున్నారు మొత్తానికి పురంధరేశ్వరి టెక్కలి ఎంచుకోవడం శ్రీకాకుళం రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది..మరి అచ్చెన్నాయుడు ఈ తాజా పరిస్థితులపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.