చెక్ సినిమాపై తారక్ ఆసక్తికర కామెంట్స్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వైవిధ్య భరితమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా చెక్.ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 Ntr Comments On Nithiin Check Movie-TeluguStop.com

ఈ సినిమా కూడా ఆసక్తి కరమైన అంశంతో రూపొందుతుంది.ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటిస్తున్నాడు.

ఉరిశిక్ష పడ్డ ఖైదీ తన చెస్ గేమ్ టాలెంట్ తో లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడో ఎంతో ఆసక్తి కరంగా దర్శకుడు తెరకెక్కించాడు.ఈ సినిమా దాదాపు 90 శాతం జైల్లోనే ఉంటుందట.

 Ntr Comments On Nithiin Check Movie-చెక్ సినిమాపై తారక్ ఆసక్తికర కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చివరి 15 నిముషాల క్లైమాక్స్‌ ఈ సినిమాకే హైలైట్.

చెక్ సినిమాను వి.ఆనందప్రసాద్ భవ్య క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా టీజర్, ట్రైలర్ ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ను పెంచాయి.

లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా ఆలస్యమైంది.కాగా ఈ సినిమా ఫిబ్రవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా నితిన్ పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పాడు.నితిన్ ఈ సినిమాను బీష్మ సినిమా చేసే సమయంలోనే అంగీకరించాడట.

డిఫరెంట్ కథలతో అలరించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు నితిన్ పళ్ళు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

అయితే తాజాగా రేపు విడుదల కాబోతున్న చెక్ సినిమా గురించి ఆ టీమ్ మొత్తానికి విషెష్ చెబుతూ ట్విట్టర్ లో తారక్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసాడు.ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో నితిన్ చెక్ సినిమా పోస్టర్ షేర్ చేస్తూ.చంద్రశేఖర్ ఏలేటి నేనెప్పుడూ అభిమానినే.

ఆయన తీసే వైవిధ్య భరితమైన స్టోరీలు సినిమాలో ఆయన చూపించే విధానం అంటే నాకు చాలా ఇష్టం.చెక్ సినిమా కూడా చాలా ఆసక్తి కరంగా ఉంది.

రేపు చెక్ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ కి నితిన్ కు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.అని టాక్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

నితిన్ ఈ ట్వీట్ కు స్పందిస్తూ ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలిపాడు.ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ వల్ల ఇప్పుడు అందరు చెక్ సినిమా గురించి మాట్లాడుతున్నారు.

అంతేకాదు ఈ ట్వీట్ కారణంగా ఈ సినిమా హైలెట్ అయ్యింది.

#Jr NTR #@yeletics #Social Media #@actor_nithiin #Nithiin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు