‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్‌పై ఎన్టీఆర్‌ ఏమన్నాడంటే..!  

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. దసరా కానుకగా ఈ చిత్రంను ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించాడు. చాలా ఏళ్లుగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇన్నాళ్లకు ఆ కాంబోలో మూవీ పట్టాలెక్కి, ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

Ntr Comments About Agnathavasi Movie Flop-

Ntr Comments About Agnathavasi Movie Flop

అంతా బాగానే ఉన్నా త్రివిక్రమ్‌ గత చిత్రం అజ్ఞాతవాసి ఫలితం ఆందోళన కలిగిస్తుంది. మినిమం గ్యారెంటీ దర్శకుడు అనుకున్న త్రివిక్రమ్‌ అజ్ఞాతవాసి చిత్రంతో అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు. దాంతో అరవింద సమేత చిత్రంపై కూడా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ అజ్ఞాతవాసి ఫలితంపై తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఒక దర్శకుడికి లేదా హీరోకు ఫ్లాప్‌ వచ్చినంత మాత్రాన తర్వాత సినిమాను కూడా అదే తరహాలో అనుకోవద్దంటూ ఎన్టీఆర్‌ సూచించాడు.

Ntr Comments About Agnathavasi Movie Flop-

అజ్ఞాతవాసి ఫలితం వల్ల అరవింద సమేత ఎఫెక్ట్‌ అవ్వదని మీరు భావిస్తున్నారా అంటూ ప్రశ్నించిన సమయంలో.. నా కెరీర్‌లో ఎన్నో సక్సెస్‌లు, ఫ్లాప్‌లు వచ్చాయి. ఫ్లాప్‌లను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను. అలాగే అజ్ఞాతవాసి తాలూకు ఫలితం ఎఫెక్ట్‌ అరవింద సమేతపై ఉంటుందని తాను భావించడం లేదని, అలాంటి అపనమ్మకం తనకు ఎప్పుడు లేదు అంటూ ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా కీలక పాత్రలో కనిపించబోతుంది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం దాదాపుగా 100 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది. మరి దసరాకు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకుని లాభాల పంట పండ్డించేనా చూడాలి.