2024 వరకు ఎన్టీఆర్ బిజీ.. ఆ దర్శకుడికి కూడా ఛాన్స్..?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత సినిమా అరవింద సమేత 2018 సంవత్సరంలో విడుదలైన సంగతి తెలిసిందే.ప్రతి సంవత్సరం కనీసం ఒక సినిమా విడుదలయ్యే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ కావడం వల్ల మూడేళ్లు ఒకే సినిమాతో బిజీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Ntr Busy With Upcoming Projects Upto 2024-TeluguStop.com

అయితే ఇదే సమయంలో రామ్ చరణ్ నటించిన ఆచార్య, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదల కానున్నాయి.

అరవింద సమేత సినిమాకు, ఆర్ఆర్ఆర్ సినిమాకు మూడేళ్లు గ్యాప్ రావడంతో ఎన్టీఆర్ 2024 వరకు వరుసగా సినిమాలు తెరకెక్కే విధంగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది.

 Ntr Busy With Upcoming Projects Upto 2024-2024 వరకు ఎన్టీఆర్ బిజీ.. ఆ దర్శకుడికి కూడా ఛాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధ్యమైతే ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్ లలో పాల్గొనే విధంగా ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం.తాజాగా ఎన్టీఆర్ ను డైరెక్ట్ చేయబోయే దర్శకుల జాబితాలో కొరటాల శివ పేరు చేరింది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో సినిమాపై భారీగా అంచనాలు నెలకోన్నాయి.గతంలో ఈ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటన వెలువడగా ఆర్ఆర్ఆర్ లో హీరోగా ఎన్టీఆర్ ఎంపిక కావడంతో ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది.

అయితే మళ్లీ ఆ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ తో భవిష్యత్తులో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ల జాబితాలో త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్ ఉండగా ఆ జాబితాలో కొరటాల శివ కూడా చేరారు.

ఈ ప్రాజెక్టులు పూర్తి కావడానికి 2024 వరకు సమయం పడుతుందని తెలుస్తోంది.వరుస ప్రాజెక్టులతో ఎన్టీఆర్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

#Junior NTR #NtrBusy #Future Projects #NtrUpcoming #2024

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు