లక్ష్మి ప్రణతి సోదరుడి సినిమా... ఈసారి తగ్గేదే లేదు

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ( Ntr ) బామ్మర్ధి నార్నే నితిన్ ( Narne Nithin )హీరోగా శ్రీశ్రీశ్రీ రాజావారు( SriSriSri Rajavaaru ) అనే సినిమా ప్రారంభం అయ్యింది.శతమానం భవతి చిత్ర దర్శకుడు సతీష్ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది అంటూ అధికారికంగా ప్రకటన వచ్చింది.

 Ntr Brother In Low Narne Nithin New Film In Geetha Arts , Ntr, Narne Nithin , Sr-TeluguStop.com

అంతే కాకుండా ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.కానీ మూడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేదు.

దాంతో ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో పాపం నితిన్ నార్నే మొదటి సినిమా నే ఇలా అయ్యింది ఏంటి అంటూ మాట్లాడుకుంటున్నారు.

Telugu Geetha, Narne Nitin, Telugu, Tollywood-Movie

మరో వైపు నితిన్ నార్నే హీరోగా మరో సినిమాను ప్రకటించేందుకు గీతా ఆర్ట్స్ వారు సిద్ధం అవుతున్నారు.బన్నీ వాసు నిర్మాణం లో ఒక కొత్త దర్శకుడి దర్శకత్వం లో నార్నే నితిన్ సినిమా ఉండబోతుంది.అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి.

ఏ క్షణంలో అయినా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి.నార్నే వారి సొంత బ్యానర్‌ లో ఈ సినిమా ఉంటుందని మొదట భావించినా కూడా గీతా ఆర్ట్స్ వారి పేరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Telugu Geetha, Narne Nitin, Telugu, Tollywood-Movie

మొత్తానికి ఈసారి నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం కన్ఫర్మ్‌.దర్శకుడు ఎవరు… హీరోయిన్‌ ఎవరు అనేది ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.ఆ విషయాలను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది లోనే సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అంటున్నారు.

ఎన్టీఆర్ బామ్మర్థి అవ్వడం వల్ల అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందా అనేది చూడాలి.అలాగే బామ్మర్థి సినిమా వేడుకకి ఎన్టీఆర్‌ ప్రోత్సాహం సహకారం ఎంత ఉంటుంది అనేది కూడా చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube