కొడాలి నానితో ఎన్టీఆర్ బ్రేక‌ప్‌.. అస‌లేం జ‌రిగింది..!

జూనియ‌ర్ ఎన్టీఆర్, ఏపీ మంత్రి కొడాలి నాని మ‌ధ్య సంబంధాలు ఈ నాటివి కావు. ఎన్టీఆర్ చిన్న పిల్లాడిగా ఉన్న‌ప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య సాన్నిహిత్యం ఉంది.

 Ntr Break Up With Kodali Nani, Kodali Nani, Jr Ntr, Break Up, Ap Minister, Nani,-TeluguStop.com

ఎన్టీఆర్ గుంటూరులో చ‌దివిన‌ప్పుడు ఆయ‌న ఆల‌నా పాల‌నా చూసే బాధ్య‌త‌లు అన్నీ నాడు హ‌రికృష్ణ నానికే అప్ప‌గించారు.ఇక ఎన్టీఆర్ తొలి సినిమా నుంచి కూడా కొడాలి నాని స‌ల‌హాలే ఎక్కువుగా ఉండేవి.

ఎన్టీఆర్‌కు క్రేజ్ తెచ్చిన ఆది సినిమా క‌థ‌, క‌థ‌నాలు, చ‌ర్చ‌లు అన్ని కొడాలి నాని ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగాయి.ఇక నాని కూడా ఎన్టీఆర్‌తో సాంబ‌, అదుర్స్ సినిమాలు నిర్మించారు.

అంత‌కు ముందే ఎన్టీఆర్ ఆంధ్రావాలా సినిమా ఆడియో ఫంక్ష‌న్ నాటి గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలోని నిమ్మ‌కూరులో కొడాలి నాని ఆధ్వ‌ర్యంలోనే గ్రాండ్‌గా జ‌రిగింది.

ఆ త‌ర్వాత ఎన్టీఆర్ సిఫార్సుతోనే నానికి టీడీపీ టిక్కెట్ ద‌క్కింది.

ఇక మొన్న ఎన్నిక‌ల త‌ర్వాత కూడా ఈ సంబంధాలు బాగానే ఉన్నా.ఇప్పుడు మాత్రం వీరి బంధం బ్రేక‌ప్ అయ్యింద‌న్న సందేహాలు, చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కూడా ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస‌రావు వైసీపీలో చేరారు.అయితే ఇప్పుడు ఎన్టీఆర్ నానితో సంబంధాలు క‌ట్ చేసుకున్నాడ‌ని అంటున్నారు.

నాని మాట‌లు, ఆయ‌న ‌వైఖ‌రితోనే ఎన్టీఆర్ ఆయ‌న‌కు దూరం దూరంగా ఉంటున్నాడంటున్నారు.నాని ఇటీవ‌ల త‌న కులాన్ని కూడా ఇబ్బంది పెట్టేలా మాట్లాడ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు.

చివ‌ర‌కు నాని వెన‌క ఎన్టీఆర్ ఉన్నాడ‌ని వాళ్ల సొంత కులంలోనే చాలా మంది అనుమానించే వ‌ర‌కు ప‌రిస్థితి వ‌చ్చింది.

Telugu Andhrawala, Ap, Break, Craze, Friendship, Guntur, Jr Ntr, Nani, Nimakur,

దీంతో నానికి దూరంగా ఉండ‌డ‌మే మంచిద‌ని ఎన్టీఆర్ ఆయ‌న‌తో సంబంధాలు క‌ట్ చేసుకున్నాడ‌న్న గుస‌గుస‌లు వ‌స్తున్నాయి.కొద్ది రోజుల క్రిత‌మే నాని త‌న ఇంట్లో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్‌ను ఆహ్వానించినా ఎన్టీఆర్ రాలేద‌ని.ఇందుకు కార‌ణం కూడా బ‌హుళా అదే అయ్యి ఉండ‌వ‌చ్చ‌ని అప్ప‌ట్లో చాలా మంది అనుమానించారు.

ఇక ఇప్పుడు వీరి మ‌ధ్య గ‌తంలో సంబంధాలు లేవ‌నే ఇండ‌స్ట్రీలో వినిపించే మాట‌.అయితే వాస్త‌వాలు ఏంట‌నేది వారికే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube