'ఆర్‌ఆర్‌ఆర్‌' అప్‌డేట్‌.. ఎన్టీఆర్‌ బర్త్‌ డే పోస్టర్‌ వచ్చేస్తోంది

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా నుండి ఇటీవలే రామ్‌ చరణ్‌ బర్త్‌ డే సందర్బంగా కొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది.ఆ పోస్టర్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 Rrr Movie Poster For Ntr Birthday , Director Rajamouli, Rrr Update, Ntr Birthday-TeluguStop.com

ఇప్పుడు ఎన్టీఆర్‌ బర్త్ డే కు కూడా కొత్త పోస్టర్‌ వస్తుందని అంతా భావించారు.కాని ఎన్టీఆర్‌ కరోనాతో బాధపడటంతో పాటు ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం బాగా లేవు.

కనుక ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా రేపు ఎలాంటి పోస్టర్ లు కాని టీజర్ లు కాని ఉండబోవడం లేదంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి.అధికారిక ట్విట్టర్ పేజీలో ఎన్టీఆర్‌ కు బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పబోతున్నారనే వార్తలు వచ్చాయి.

ఎన్టీఆర్‌ అభిమానులు ఈ విషయమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.చరణ్‌ బర్త్‌ డే కు పోస్టర్ ను విడుదల చేసి ఇప్పుడు ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా ఎందుకు పోస్టర్ ను ఇవ్వడం లేదు అంటూ జక్కన్నను తాజాగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

దాంతో జక్కన్న టీమ్‌ కొత్త పోస్టర్‌ ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

బర్త్‌ డే సందర్బంగా ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు అంటూ అభిమాన సంఘాలకు ఎన్టీఆర్‌ లేఖ రాశాడు.

ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న రూపొందబోతున్న సినిమా లకు సంబంధించి ఎలాంటి అప్‌ డేట్‌ కూడా ఇవ్వడం లేదన్నారు.కాని అవి పుకార్లే అని తేలిపోయింది.

జక్కన్న టీమ్‌ నుండి సర్‌ ప్రైజ్‌ రాబోతుంది.రేపు ఉదయం పది గంటలకు కొమురం భీమ్‌ కొత్త పోస్టర్ పడబోతుంది.

మొత్తానికి ఎన్టీఆర్ కరోనాతో బాధపడుతున్న ఈ సమయంలో ఎలాంటి పోస్టర్ లు విడుదల చేయకూడదని భావించినా కూడా అభిమానులను సంతృప్తి పర్చేందుకు జక్కన్న పోస్టర్ విడుదల చేయక తప్పడం లేదు.ఇక ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉండబోతుంది.

ఆ సినిమా కు సంబంధించిన పోస్టర్ కూడా వస్తే బాగుంటుందని అభిమానులు ఆశ పడుతున్నారు.మరి ఉంటుందా లేదా అనేది చూడాలి.

ఇక ఎన్టీఆర్‌ ఇంకా కరోనా తోనే బాధపడుతున్నాడు.అయితే లక్షణాలు ఎక్కువగా లేకపోడం ఆనందించదగ్గ విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube