అతని వల్లే బాలయ్య వద్దకు వెళ్లిన జూ. ఎన్టీఆర్ విషయం...! మరి బాలయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో.?   NTR Biopic : Will Nandamuri Balakrishna Include Jr NTR     2018-10-28   08:11:05  IST  Sainath G

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రం ఘనవిజయం సాధించింది. వసూళ్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతుంది. 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడం విశేషం.ఇది ఇలా ఉంటె…బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా భాగం కాబోతున్నాడంటూ చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ పాత్రలో తారక్ నటిస్తున్నారు అనే వార్త వైరల్ అవుతుంది. షూటింగ్ కి కూడా అటెండ్ అయ్యారు అని కొందరు అంటున్నారు.

ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉందో తేలాల్సి ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్నాడంటూ కూడాకొత్త ప్రచారం మొదలయింది. దర్శకుడు క్రిష్ వల్లే ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ వాయిస్ గంభీరంగా, అద్భుతంగా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాకు యంగ్ టైగర్ వాయిస్ ఓవర్ ఇస్తే చాలా బావుంటుందని దర్శకుడుకు క్రిష్ భావిస్తున్నాడట. క్రిష్ ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ముందు ఉంచినట్లు తెలుస్తోంది.

NTR Biopic : Will Nandamuri Balakrishna Include Jr NTR-

అయితే ఈ విషయంలో బాలయ్య ఇంకా నిర్ణయం తీసుకోలేదట. జూ. ఎన్టీఆర్ ప్రమేయం ఈ చిత్రంలో ఎలాగోలా ఉండేలా బాలయ్య నిర్ణయం తీసుకుంటాడని అంతా ఆశిస్తున్నారు.కళ్యాణ్ రామ్ అయితే ఏకంగా తన తండ్రి హరికృష్ణ పాత్రలోనే నటిస్తుండడం విశేషం. హరికృష్ణ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఈ చిత్రంలో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. చంద్రబాబుగా దగ్గుబాటి రానా నటిస్తున్నాడు.అక్కినేని నాగేశ్వర రావు గారి పాత్రలో సుమంత్ నటిస్తున్నారు.