భీం టీజర్ రికార్డులను కొట్టేవారే లేరు!

బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

 Ntr Bheem Teaser To Set All Time Record, Ntr, Bheem, Rrr, Bheem Teaser, Tollywoo-TeluguStop.com

కాగా ఈ సినిమాలోని హీరోల పాత్రలకు సంబంధించిన టీజర్లను చిత్ర యూనిట్ ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా రామ్ చరణ్ నటిస్తున్న అల్లూరి సీతారామరాజ పాత్ర టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రాగా, తారక్ నటిస్తున్న కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఇప్పటికే ఈ టీజర్ 1 మిలియన్ లైక్స్‌ను క్రాస్ చేయగా, మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అయ్యింది.ఈ టీజర్ త్వరలోనే 1 మిలియన్ కామెంట్స్‌ను కూడా రీచ్ కాబోతోంది.

ఇప్పటికే 9 లక్షల కామెంట్స్‌తో దూసుకుపోతున్న ఈ టీజర్ త్వరలోనే ఈ సరికొత్త మైలరాయిని చేరుకోనుంది.ఇక ఈ టీజర్ సాధించిన రికార్డు మరే ఇతర తెలుగు చిత్రానికి సంబంధించిన టీజర్ సాధించలేదు.

త్వరలోనే 1 మిలియన్ కామెంట్స్ సాధించే టీజర్‌గా రికార్డు క్రియేట్ చేయనున్న తారక్ భీం టీజర్ తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్‌గా ఇలాంటి రికార్డు సాధించిన తొలి టీజర్‌గా నిలవనుంది.ఇక ఈ సినిమాలో రామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తుండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.మరి ఈ సినిమా రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube