మరో అరుదైన రికార్డు కొట్టిన భీమ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నాడు.

 Ntr Bheem Teaser Breaks Another Record, Ntr, Bheem, Rrr, Rajamouli, Ram Charan,-TeluguStop.com

ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

కాగా కొమురం భీం పాత్రకు సంబంధించిన టీజర్‌ను ఇటీవల దసరా కానుకగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ టీజర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఆకలిని జక్కన్న పూర్తిగా తీర్చేశాడని చెప్పాలి.

ఈ టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు ఈ టీజర్ కొన్ని నెవర్ బిఫోర్ రికార్డులను సొంతం చేసుకుంది.ఇప్పటికే ఈ టీజర్‌కు 1 మిలియన్ లైకులు వచ్చిన సంగతి అందిరికీ తెలిసిందే.

కాగా తాజాగా ఈ టీజర్‌కు లక్ష కామెంట్లు రావడంతో ఈ రికార్డు కొట్టిన తొలి టీజర్ వీడియోగా ఇది నిలిచింది.

ఇలా మునుపెన్నడూ లేని రికార్డులను కొల్లగొట్టిన భీమ్ టీజర్‌ను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తుండటంతో ఈ టీజర్ ఇంకా మున్ముందు ఎలాంటి రికార్డులు సాధిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఒలివియా మారిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube