ఒకే వేదికపై కనిపించబోతున్న ఎన్టీఆర్, బాలయ్య  

  • ఎన్టీఆర్ బాలకృష్ణ మ‌ధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి అందరికి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఒకరి సినిమా ఫంక్షన్స్ కి మరొకరు హాజరుకావమేలేదు. దీంతో నందమూరి అభిమానులంతా వీరు ఎప్పుడు కలుస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఆశ తీరిపోయే సమయం వచ్చేసింది. అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` స‌క్సెస్ మీట్‌కి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఆదివారం సాయింత్రం శిల్పారామంలో `అర‌వింద స‌మేత‌` విజ‌యోత్స‌వం జ‌ర‌గ‌బోతోంది. బాల‌య్య – ఎన్టీఆర్ – క‌ల్యాణ్‌రామ్ ఒకే వేదిక‌పై క‌నిపించ‌డం ఓ అరుదైన‌, అంద‌మైన జ్ఞాప‌క‌మే.

  • Ntr Balayya Is Going To Be On The Same Platform-

    Ntr Balayya Is Going To Be On The Same Platform

  • బాబాయ్ ఈ ఫంక్ష‌న్‌కి మీరే రావాల్సిందే` అంటూ క‌ల్యాణ్ రామ్ బాగా ప‌ట్టుప‌ట్టాడ‌ట‌. బాల‌య్య ఇప్పుడు క‌ల్యాణ్ రామ్ మాట కాద‌న‌లేడు. ఎందుకంటే `ఎన్టీఆర్‌`లో క‌ల్యాణ్‌రామ్ హ‌రికృష్ణ‌లా న‌టించ‌డానికి ఒప్పుకున్నాడు. దానికి తోడు హ‌రికృష్ణ మ‌ర‌ణంతో క‌ల్యాణ్‌రామ్‌,ఎన్టీఆర్ కుంగిపోయారు. వాళ్ల‌కు అండ‌గా ఉన్నా అన్న సంకేతం బాల‌య్య మాత్రమే ఇవ్వ‌గ‌ల‌డు. దానికి ఇంత‌కు మించిన త‌రుణం ఉండ‌దు. బాలకృష్ణ – ఎన్టీఆర్ మ‌ధ్య కోల్డ్ వార్‌కి… ఈ స‌క్సెస్ మీట్ తెర‌దించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.