ఎన్టీఆర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ మల్టీస్టారర్స్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రం తర్వాత ఎట్టకేలకు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్నాడు.ఆరు నెలల విరామం తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ‘అరవింద సమేత’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

 Ntr Back To Back Multi Starrers-TeluguStop.com

దసరాకు ఆ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లలో దర్శకుడు మునిగి ఉన్నాడు.

ఇక అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌తో కలిసి ఒక మల్టీస్టారర్‌ను చేయబోతున్నాడు.అందుకు సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఈ భారీ మల్టీస్టారర్‌ను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు మల్టీస్టారర్‌ మూవీస్‌ అంటే పిచ్చి ఇష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సినిమాలో పెద్దగా మ్యాటర్‌ లేకున్నా కూడా మంచి స్టార్‌కాస్టింగ్‌తో, ఇద్దరు పెద్ద హీరోలతో సినిమా వస్తే తప్పకుండా ఆ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తారు.ఆ విషయం గతంలో పలు సార్లు వెళ్లడి అయ్యింది.

అందుకే ఈ మద్య వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తున్నాయి.నాగ్‌, నానిల మల్టీస్టారర్‌తో పాటు వెంకీ, వరుణ్‌ మరియు వెంకీ, చైతూల మల్టీస్టారర్‌లు తెర రూపం దాల్చుతున్నాయి.

ఇలాంటి సమయంలోనే మరో మల్టీస్టారర్‌ గురించిన ఆసక్తికర ప్రకటన కళ్యాణ్‌ రామ్‌ చేసి అందరిలో చర్చకు తెర లేపాడు.

నేడు కళ్యాణ్‌ రామ్‌ నటించిన ‘నానువ్వే’ చిత్రం విడుదలైంది.

ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన మాట్లాడుతూ తన సొంత బ్యానర్‌లో త్వరలో ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.మరో ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌ హీరోగా తన బ్యానర్‌లో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కళ్యాణ్‌ రామ్‌ చేసిన ఆ రెండు వ్యాఖ్యలను చూసినట్లయితే త్వరలోనే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో కళ్యాణ్‌ రామ్‌ నిర్మాణంలో ఎన్టీఆర్‌ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు, అది మల్టీస్టారర్‌ సినిమా అంటూ సమాచారం అందుతుంది.పవన్‌ సాదినేని దర్శకత్వంలో ఆ మల్టీస్టారర్‌ ఉంటుందని కూడా అనిపిస్తుంది.

ఈ సమయంలోనే ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో రూపొందబోతున్న చిత్రంలో తాను కూడా ఉంటాను అంటూ కాస్త అటు ఇటుగా చెప్పాడు.అంటే ఎన్టీఆర్‌ హీరోగా పవన్‌ సాదినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్‌లో నటించబోతున్న మరో హీరో ఎవరో కాదు కళ్యాణ్‌ రామ్‌ అని తేలిపోయింది.

త్రివిక్రమ్‌ మూవీ అయిన వెంటనే రాజమౌళి మల్టీస్టారర్‌ చేయనున్న ఎన్టీఆర్‌, ఆ వెంటనే అన్న కోసం పవన్‌ సాదినేని దర్శకత్వంలో అన్నతో కలిసి మల్టీస్టారర్‌ను చేయడం ఖాయం అయ్యింది.ఒక స్టార్‌ హీరో బ్యాక్‌ టు బ్యాక్‌ మల్టీస్టారర్‌ చిత్రాలు చేయడం అంటే గొప్ప విషయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube