మహేష్‌ తర్వాత పవన్‌ తోనే.. ఎన్టీఆర్‌ మూవీ క్యాన్సిల్‌ అయినట్లేనా?

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కాల్సి ఉంది.ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ ఆలస్యం అవుతూ ఉండటం వల్ల ఇన్ని రోజులు ఆ సినిమా కూడా వాయిదా ల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

 Ntr And Trivikram Srinivas Movie Not In Future , Mahesh Babu, Ntr, Ntr30, Paw-TeluguStop.com

ఎట్టకేలకు సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్న సమయంలో అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి సినిమా ను త్రివిక్రమ్‌ దర్శకత్వం లో కాకుండా కొరటాల శివ దర్శకత్వం లో అంటూ ప్రకటించాడు.ఇక త్రివిక్రమ్‌ కూడా తన తదుపరి సినిమా మహేష్‌ బాబుతో అధికారికంగా ప్రకటించాడు.

వీరిద్దరు ఇటీవల కమిట్ అయిన సినిమా ల తర్వాత మళ్లీ జత కలిసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.కాని అనూహ్యంగా పవన్‌ కళ్యాణ్‌ తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

మహేష్‌ బాబుతో సినిమా పూర్తి అయిన వెంటనే అంటే వచ్చే ఏడాది చివరికి పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను మొదలు పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని అంటున్నారు.

ఇక ఎన్టీఆర్‌ కూడా కొరటాల శివ సినిమా తర్వాత ఇతర సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు.కనుక భవిష్యత్తులో మళ్లీ ఎన్టీఆర్‌ మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాబోయే మూడు నాలుగు ఏళ్లలో మాత్రం వీరి కాంబోలో మూవీ ఉండక పోవచ్చు అనేది చాలా మంది నమ్మకంగా చెబుతున్న విషయం.కనుక ఎట్టి పరిస్థితుల్లో త్రివిక్రమ్ దర్శకత్వం లో ఎన్టీఆర్‌ రెండవ సినిమా ఉండక పోవచ్చు అంటున్నారు.

అయిననూ పోయిరావలే హస్తినకు సినిమా టైటిల్ ను కూడా ప్రకటించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు క్యాన్సిల్ చేశారు ముందు ముందు కూడా మళ్లీ సినిమా ఉంటుందో లేదో అనే అనుమానం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube