ఎన్టీఆర్‌.. త్రివిక్రమ్‌ మూవీ ఆ విషయం క్లారిటీ వచ్చేది ఎప్పుడో?

అల వైకుంఠ పురంలో సినిమా విడుదల అయిన వెంటనే ఎన్టీఆర్‌ 30 సినిమా ను ప్రకటించిన త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసుకుని దాదాపు ఏడాది కాలంగా వెయిట్‌ చేస్తున్నాడు.మొన్నటి వరకు కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఇప్పుడు రాజమౌళి చెక్కతున్న ఆర్ఆర్‌ఆర్‌ సినిమా వల్ల ఆలస్యం అవుతోంది.

 Ntr And Trivikram Movie Shooting Update May Give By Ugadi Festival , Ntr30, Triv-TeluguStop.com

ఆర్ ఆర్‌ ఆర్ సినిమా షూటింగ్ ముందుగా అనుకున్న ప్రకారం మార్చిలో పూర్తి అవ్వాల్సి ఉంది.ఏప్రిల్‌ లో ఎన్టీఆర్‌ 30 సినిమా పట్టాలు ఎక్కాల్సి ఉంది.

కాని ఏప్రిల్‌ వరకు ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా షూటింగ్‌ కంటిన్యూ అవ్వడం ఖాయంగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.తద్వారా ఎన్టీఆర్‌ మరియు త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ మరో నెల నుండి నెలన్నర వరకు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంతకు ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కే విషయమై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

టాలీవుడ్‌ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30వ సినిమా పట్టాలు ఎక్కే విషయం మరియు విడుదలకు సంబంధించిన విషయాన్ని ఆయన పుట్టిన రోజు అయిన మే 20న వెళ్లడించే అవకాశం ఉందంటున్నారు.

ఒక వేళ ఏప్రిల్‌ 20వ తారీకు ముందే షూటింగ్‌ మొదలు అయితే తప్పకుండా ఆ రోజు త్రివిక్రమ్‌ నుండి ఏదైనా ప్రత్యేకమైన సర్‌ ప్రైజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మొత్తానికి ఆలస్యం అవుతున్నా కూడా సినిమా షూటింగ్‌ విషయంలో త్రివిక్రమ్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్‌ బర్త్‌ డే స్పెషల్‌ గా ఏం రిలీజ్ చేస్తాడు అనేది చూడాలి.ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ సినిమా విడుదల అక్టోబర్‌ లో ఉండబోతుంది.

ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ లో ఉంటుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube