బ్యాడ్ న్యూస్‌: ఇంకాస్త ఆలస్యం అవ్వబోతున్న ఎన్టీఆర్‌30

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ 30వ సినిమా ప్రకటన వచ్చి ఏడాది దాటి పోయింది.త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఎన్టీఆర్‌ 30వ సినిమా ఆర్‌ఆర్ఆర్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది.

 Ntr And Trivikram Movie Shooting Late , Ntr30movie, Rrr, Trivikram, Ntr Birthday-TeluguStop.com

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా కోసం అభిమానులు గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్నారు.కాని సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు.

సినిమాను మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది.అది కాస్త ఏప్రిల్‌ కు వాయిదా వేశారు.

ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడం లేదని అందుకే సినిమాను మే నెలలో పట్టాలెక్కించే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ ఆరంభంలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.

కాని పరిస్థితి చూస్తుంటే సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సమాచారం అందుతోంది.

Telugu Ntr Trivikram, Ntr, Rrr, Trivikram-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 సినిమా కు సంబంధించిన మొత్తం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అయ్యింది.సినిమా హీరోయిన్‌ విషయమై ఇటీవలే తుది నిర్ణయం తీసుకున్నారు, రష్మిక మందన్నాను ఈ సినిమా కోసం ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి.పెద్ద ఎత్తు అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ కోసం మరో వైపు సెట్టింగ్‌ లు కూడా వేయిస్తున్నారు.

అందుకే సినిమా ఖచ్చితంగా మే నెలలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా త్రివిక్రమ్‌ సినిమా ఫస్ట్‌ లుక్ ను కూడా విడుదల చేస్తాడేమో అంటూ ఆసక్తిగా చెబుతున్నారు.

మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా గత ఏడాది వచ్చిన అల వైకుంఠపురంలో చేస్తోంది.త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠ పురంలో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube