నెలన్నర ముందుగానే ఆ ఫార్మాల్టీస్ ను పూర్తి చేసుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఆర్ఆర్ఆర్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులు లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

 నెలన్నర ముందుగానే ఆ ఫార్మాల్-TeluguStop.com

ఒక మాట చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులకు ఇది ఒక పండుగ లాంటి సినిమా అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమా విడుదలకు ఇంకా నెలన్నర సమయం ఉంది.

ఈ లోపే సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి జక్కన్న అందర్నీ ఆశ్చర్యపరిచాడు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సెన్సార్ కార్యక్రమాలు అడ్డు రాకూడదనే  ఉద్దేశంతో ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేయించాలని వార్తలు వస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సెన్సార్ బోర్డు వారు యు / ఎ సర్టిఫికెట్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది.కేవలం ఈ సినిమాలో యాక్షన్ మాత్రమే కాకుండా హీరోలు హీరోయిన్ల మధ్య రోమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్తున్నారు.

సెన్సార్ బోర్డ్ వాళ్ళు ఈ సినిమా ఒక అద్భుతం అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తన గత సినిమా బాహుబలి ని మించి ఈ సినిమా ఉండేలా చిత్రీకరించారని అంటున్నారు.

Telugu Ajay Devgan, Aliabhatt, Censor, Rajamouli, Ram Charan, Shiya Sharan-Movie

ఒక అద్బుతంను చూస్తున్నట్లు ఉందంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.కచ్చితంగా ఆ సినిమాను మించి ఈ సినిమా వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళు వ్యక్తం చేస్తున్నారు.సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది కనుక ఈసారి విడుదల విషయం లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికి మూడు నాలుగు సార్లు విడుదల వాయిదా పడడం వల్ల జనవరి కైన ఈ సినిమా వస్తుందా అనే అనుమానాలు కొందరిలో ఉన్నాయి.

కానీ సెన్సార్ తో ఆ అనుమానాలు అన్నిటికీ పులిస్టాప్ పెట్టినట్లే అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube