ఆర్ఆర్ఆర్ కోసం హిందీ, తమిళ్ లో కూడా సొంతగొంతుతోనే

తెలుగులో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్.రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబందించిన టైటిల్ మోషన్ పోస్టర్, రామ్ చరణ్ పరిచయం టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి.

 Ntr And Ram Charan Own Dubbing In Hindi Also For Rrr Movie, Tollywood, Bollywood-TeluguStop.com

ఇవి రాజమౌళి నుంచి ఆశించిన స్థాయిలోనే గూస్ బాంబ్స్ తరహాలో ఉన్నాయి.ఇక సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగిస్తున్నాయి.

రామ్ చరణ్ పాత్ర అల్లూరిని పరిచయం చేస్తూ ఎన్టీఅర్ చెప్పిన డైలాగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి.ఈ రెండు టీజర్స్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఇక ఎన్టీఆర్ పాత్ర కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో కూడా రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇక తమిళ, హిందీ భాషలలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో సొంతంగా డబ్బింగ్ చెప్పించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.బాహుబలి సినిమా కోసం ప్రబాస్ కి హిందీలో వేరొకరు డబ్బింగ్ చెప్పారు.

ఈ సారి అలా కాకుండా సొంత డబ్బింగ్ తోనే హిందీలో ఆడియన్స్ ని మెప్పించాలని రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా భావిస్తున్నారు.రామ్ చరణ్ కి గతంలో హిందీలో జంజీర్ సినిమా చేసిన అనుభవం ఉంది.

ఈ నేపధ్యంలో సొంత డబ్బింగ్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube