జాన్వీ కపూర్ కెరీర్ కీలక టర్న్‌ తీసుకుంటుందా... లేదంటే ఫ్లాప్‌ తప్పదా?

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.ఒక్క సినిమా తో కూడా జాన్వీ కపూర్ సక్సెస్ సొంతం చేసుకోలేక పోయింది.

 Ntr And Koratala Siva Movie Very Important For Janhvi Kapoor's Film Career,ntr,k-TeluguStop.com

లేడీ ఓరియంటెడ్ సినిమా లు చేసినా.కమర్షియల్ సినిమాలు చేసినా కూడా అదృష్టం కలిసి రాక పోవడంతో వరుసగా ఫ్లాప్స్ చవి చూడాల్సి వచ్చింది.

అని వర్గాల ప్రేక్షకులను అలంకరించే విధంగా అన్ని జోనర్స్‌ లో సినిమాలను చేసిన జాన్వీ కపూర్ అసలు కమర్షియల్ సక్సెస్ అంటే ఏంటో తెలియకుండా కెరియర్ లో ముందుకు సాగుతుంది.పాపం ఈ అమ్మడి యొక్క కెరియర్ టర్న్ తీసుకొని సక్సెస్ సొంతం చేసుకోవాలంటే త్వరలో టాలీవుడ్ లో నటించబోతున్న ఎన్టీఆర్ సినిమా తోనే సాధ్యం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో శృతి హాసన్ కూడా వరుసగా ఫ్లాప్స్ చవి చూస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సక్సెస్ అయ్యి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఇన్నాళ్లు కొనసాగుతూనే ఉంది.మళ్లీ జాన్వీ కపూర్ కి ఆ అవకాశం లభిస్తుందా.టాలీవుడ్ లో సక్సెస్ అయి మళ్ళీ బాలీవుడ్ లో అడుగు పెట్టి వరుసగా సక్సెస్ లను సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.

ఒకవేళ ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కూడా ఫ్లాప్ అయితే కచ్చితంగా జాన్వీ కపూర్ కెరీర్ మరింతగా సందిగ్ధంలో పడ్డట్లు అవుతుంది. ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా సూపర్ హిట్ అవడం ఖాయం.ఆ సినిమాతో సౌత్ ఇండియా తో పాటు బాలీవుడ్ లో కూడా ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కి మంచి పేరు మరియు క్రేజ్ దక్కే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube