ఎన్టీఆర్‌30.. సంక్రాంతికి ఫ్యాన్స్‌ కోసం ఓ సర్‌ప్రైజ్‌

Ntr And Koratala Shiva Movie Upd

నందమూరి అభిమానులు ఎన్టీఆర్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా ఏది అధికారికంగా ప్రకటించలేదు.

 Ntr And Koratala Shiva Movie Upd-TeluguStop.com

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఏకంగా ఆయన మూడేళ్ల పాటు వర్క్ చేశారు.సరే జక్కన్న సినిమా అంటే ఆ మాత్రం టైం కేటాయించాల్సి ఉంది.

కనుక అభిమానులు సరిపెట్టుకున్నారు.కానీ ఆ సినిమా పూర్తి అయి కూడా చాలా నెలలు అవుతుంది.

 Ntr And Koratala Shiva Movie Upd-ఎన్టీఆర్‌30.. సంక్రాంతికి ఫ్యాన్స్‌ కోసం ఓ సర్‌ప్రైజ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయినా ఇప్పటి వరకు ఎన్టీఆర్ తదుపరి సినిమా ప్రారంభం అవ్వలేదు.ఆర్‌ ఆర్ ఆర్ సినిమా లో నటించిన మరో హీరో రామ్ చరణ్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు.

ఇప్పటికే ఆచార్య సినిమా ను పూర్తి చేశాడు శంకర్ దర్శకత్వంలో సినిమా ప్రారంభించాడు.

మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం లో ఓ సినిమా చేసేందుకు చర్చలు ప్రారంభించాడు.

ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు అంటూ విమర్శలు రావడం చాలా సహజం.అభిమానుల అసంతృప్తిని పసిగట్టిన ఎన్టీఆర్ సంక్రాంతి కానుకగా వాళ్లకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో అనే విషయం తెలిసిందే.

ఆచార్య సినిమాను ముగించిన కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కోసమే స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సరైన హిట్టును ఇచ్చేందుకు కొరటాల శివ ఎదురు చూస్తున్నాడు.సంక్రాంతి కి సినిమాకు సంబంధించిన కీలక అప్ డేట్ ను ఇవ్వడం కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒక కాన్సెప్ట్ పోస్టర్ను లేదా ఏదైనా ఒక ఆసక్తికర విషయాన్ని సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ మరియు కొరటాల షేర్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.అదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ డబుల్ ఎంటర్టైన్మెంట్ మరియు సంతోషాన్ని ఇవ్వడం ఖాయం.

#NTR #Sankranthi #Koratala Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube