ఆత్మహత్య చేసుకోబోయిన ఎన్టీఆర్     2017-09-18   00:20:12  IST  Raghu V

ఓ పాత్రలో నటించడం వేరు, ఆ పాత్రలోకి పరాకాయ ప్రవేశం చేసి జీవించడం వేరు. కొందరు నటులు తాము సినిమాలో పోషించిన పాత్రలోంచి బయటకి రావడానికి చాలా సమయం తీసుకుంటారు. బ్యాట్ మెన్ సీరీస్ లోని జోకర్ పాత్ర ఎంత ప్రాచూర్యం పొందిందో మీ అందరికి తెలిసిందే. ప్రపంచ సినీ చరిత్రలో బెస్ట్ విలన్ పాత్ర అంటారు దాన్ని. ఆ పాత్ర పోషించిన హీత్ లేద్జర్ ఓ నెలరోజులపాటు తన అపార్ట్మెంట్ కి తాళం వేసుకొని ఒంటరిగా గడిపాడట. ఎందుకు అంటే తనకే తెలియదు. జోకర్ లా తానూ బయటివారికి హాని చేయకూడదు, ఆ పాత్ర ప్రభావం తగ్గాకే బయటకి రావాలి అనుకున్నాడేమో. ఇలాంటి ఉదహారణలు ఇంకొన్ని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు ఆ ఉదాహరణల లిస్టులోకి వచ్చి చేరాడు మన యాంగ్ టైగర్ ఎన్టీఆర్.

జై లవ కుశలో మూడు విభిన్న పాత్రలు పోషించిన ఎన్టీఆర్ కి జై పాత్ర బాగా ఇష్టం. ఆ పాత్రలోంచి ఎన్టీఆర్ బయటకి రాలేకపోతున్నాడట. ఎంతలా ఆ పాత్ర మాయలో పడిపోయాడంటే ఓరోజు రాత్రి సడెన్ గా లేచి కిటికీకి వేలాడుతూ, చంపేస్తా, చచ్చిపోతా అంటూ తనలో తానే మాట్లాడుకున్నాడట. సమయానికి ఎన్టీఆర్ సతీమణి ప్రణతి నిద్రలేచి ఎన్టీఆర్ ని స్పృహలోకి తీసుకువచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఎంత అనర్థం జరిగిపోయేదో.

ఈ విషయాలన్నీ ఎన్టీఆర్ స్వయంగా నిన్న ఓ ప్రముఖ టీవి చానెల్ తో పంచుకున్నా, ఆ తరువాత ఎన్టీఆర్ పీఆర్ టీం ఆ ఇంటర్వ్యూని డిలీట్ చేయించడం విశేషం. మిగితా వార్తల్లోకి వెళితే, జై లవ కుశ ఈ నెల 21న రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల కానుంది.