అఖిల్ ను ఒళ్ళో కుర్చోపెట్టుకున్న ఎన్టీఆర్..పిక్ వైరల్..!

అక్కినేని అఖిల్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ ఫోటో ఇప్పటిది కాదు.2004 లో దిగిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ ఫొటోలో తారక్ అఖిల్ ను ఒళ్ళో కూర్చో పెట్టుకుని ఉన్నాడు.

 Ntr Akhil Photo Viral In Social Media-TeluguStop.com

అప్పుడు అఖిల్ వయసు సుమారు 10 సంవత్సరాలు ఉంటుంది.ఇప్పుడు ఈ ఫోటో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.

అఖిల్ ను ఎన్టీఆర్ ను ఇప్పుడు చుస్తే అంత తేడా కనిపించదు.కానీ ఈ ఫొటోలో మాత్రం అఖిల్ చిన్న పిల్లాడుగా ఉంటె ఎన్టీఆర్ పెద్దవాడిగా కనిపిస్తున్నాడు.

 Ntr Akhil Photo Viral In Social Media-అఖిల్ ను ఒళ్ళో కుర్చోపెట్టుకున్న ఎన్టీఆర్..పిక్ వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫోటో సాంబ సినిమా టైం లోనిది అని అర్ధం అవుతుంది.ఆ సమయంలో జరిగిన ఫంక్షన్ కు అఖిల్ కూడా వెళ్లినట్టు తెలుస్తుంది.ఆ సమయంలో అఖిల్ ముద్దుగా నవ్వుతు ఎన్టీఆర్ ఒళ్ళో కూర్చుని ఉన్నాడు.

Telugu Akhil, Akhil Akkineni, Most Eligible Bachelor, Ntr, Ntr Akhil Photo Viral In Social Media, Ntr And Akhil Viral Photo, Ntr With Akkineni Akhil, Photo Viral, Rrr, Samba Movie, Social Media-Movie

ఆ సమయంలో ఎన్టీఆర్ చాలా లావుగా ఉన్నాడు.అప్పుడు ఎన్టీఆర్ వయసు 21 సంవత్సరాలు మాత్రమే.కానీ లావుగా ఉండడంతో పెద్దవాడిగా కనిపించదు.

ఇప్పుడు తారక్ సన్నగా ట్రెండీ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు.ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాను రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు.

ఈ సినిమాను 450 కోట్ల బడ్జెట్ తో డి వి వి దానయ్య పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 13 న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.జూన్ 19 న ఈ సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.

#NtrAnd #Akhil #NtrWith #MostEligible #NtrAkhil

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు