ఎన్టీఆర్‌31 : మరీ ఇంత తొందర ఎందుకు ప్రశాంత్ నీల్‌

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే.కేజీఎఫ్ 2 కు ముందు వరకు ఈ సినిమా కు ఒకింత అంచనాలు ఉన్నాయి.

 Ntr 31 First Look Coming For Birthday , Jr Ntr‌ , Prashant Neil , Kgf2 , Ntr‌31 , Mythri Movie Makers ,ntr‌ Birthday-TeluguStop.com

కాని కేజీఎఫ్ 2 విడుదల అయ్యి వెయ్యి కోట్లకు పైగా నే వసూళ్లు చేసిన తర్వాత ఎన్టీఆర్‌ 31 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఎన్టీఆర్‌ 31 కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అంటూ ఎప్పుడో క్లారిటీ వచ్చింది.

కాని ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన అధికారిక అప్‌డేట్‌ అయితే లేదు.అయినా కూడా చిత్ర యూనిట్ సభ్యులు అదుగో ఇదుగో అంటూ ప్రచారం చేస్తున్నారు.

 Ntr 31 First Look Coming For Birthday , Jr NTR‌ , Prashant Neil , KGF2 , NTR‌31 , Mythri Movie Makers ,NTR‌ Birthday-ఎన్టీఆర్‌31 : మరీ ఇంత తొందర ఎందుకు ప్రశాంత్ నీల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మైత్రి మూవీ మేకర్స్ వారు ఎన్టీఆర్‌ 31 కి సంబంధించిన అప్‌ డేట్‌ ను రేపు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్బంగా ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.భారీ అంచనాల నడుమ కేజీఎఫ్ 2 సినిమా విడుదల అయ్యి వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన కారణంగా నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్‌ 31 ను ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ మొదలు పెడతాడు అంటూ ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు సినిమా నుండి క్లారిటీని ఇవ్వడం కోసం రేపు పుట్టిన రోజు వేడుకను వేదికగా చేసుకుంటున్నారు.ఆసక్తికర విషయం ఏంటీ అంటే ఎన్టీఆర్‌ 31 సినిమా కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కోసం ఎన్టీఆర్‌ పై ప్రశాంత్‌ నీల్‌ ఫోటో షూట్‌ టెస్ట్‌ షూట్‌ నిర్వహించాడు.

అందుకే ఖచ్చితంగా మంచి లుక్ ఒకటి రేపు పుట్టిన రోజున వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే సినిమా ప్రారంభంకు కనీసం ఇంకా ఆరు నెలల సమయం ఉంది.

షూటింగ్‌ పూర్తి అయ్యి విడుదల అయ్యేప్పటికి ఏడాది కంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.అయినా కూడా ఎందుకు ఇంత హడావుడి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు మాత్రం ప్రశాంత్‌ నీల్‌ స్పీడ్‌ చూసి సంతోషిస్తున్నారు.ప్రస్తుతం సలార్‌ సినిమా షూట్‌ లో ఉన్న ప్రశాంత్‌ నీల్‌ ఈ ఏడాది చివర్లో ఎన్టీఆర్ 31 ను మొదలు పెట్టే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube