ఆచార్య తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో యంగ్ టైగర్ ఎన్.టి.
ఆర్ హీరోగా ఒక సినిమా రాబోతుంది.ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ తారక్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు.
ఈ రిలీజ్ చేసింది మోషన్ పోస్టరే అయినా దానికి వెనకాల చెప్పించిన వాయిస్ ఓవర్ అదిరిపోయింది.అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి తను ఉండకూడదని.అప్పుడు భయానికి తెలియాలి.తను రావాల్సిన సమయం వచ్చిందని.
వస్తున్నా.అని ఎన్.టి.ఆర్ చెప్పిన తీరు చూస్తుంటే నందమూరి ఫ్యాన్స్ కి కావాల్సిన సినిమా ఇచ్చేస్తున్నానని కొరటాల శివ ఈ ఫస్ట్ గ్లింప్స్ తోనే చెప్పేశాడు.
అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత అల్లు అర్జున్ తో కొరటాల శివ చేయాల్సిన ఆ కథనే మార్చి ఎన్.టి.ఆర్ తో చేస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది.కొరటాల శివతో బన్నీ సినిమా ఎనౌన్స్ మెంట్ చేస్తూ వదిలిన పోస్టర్ బ్యాక్ డ్రాప్ కి.లేటెస్ట్ గా ఎన్.టి.ఆర్ 30వ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మోషన్ పోస్టర్ కి పోలికలు ఉన్నాయి.ఆ కథనే మార్చి తారక్ కోసం సిద్ధం చేశాడని గట్టి వాదన వినిపిస్తుంది.
అల్లు అర్జున్ తో ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందో తెలియదు కానీ ఎన్.టి.ఆర్ 30 పాన్ ఇండియా మూవీగా సంచలనానికి సిద్ధమైంది.