ఎన్టీఆర్‌ 30 పై కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రభావం.. ఇంకెన్నాళ్లు ఈ ఎదురు చూపులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్  హీరోగా చివరి సారి ప్రేక్షకుల ముందుకు వచ్చి చాలా ఏళ్లు అయింది.ఆయన రాజమౌళి సినిమా కోసం ఏకంగా నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.

 Ntr 30 Film Again Postpone Due To Covid 19 And Other Issues Details, Jr Ntr, Dir-TeluguStop.com

ఈ నాలుగు సంవత్సరాల్లో ఆయన ఆర్.ఆర్.ఆర్ మినహా మరే సినిమాను చేయలేదు.ఆయనతో కలిసి జక్కన్న సినిమా చేస్తున్న రామ్ చరణ్ తేజ్ మాత్రం మరో రెండు మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.

ఇప్పటికే తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.మరోవైపు శంకర్ సినిమా ను కూడా మొదలు పెట్టాడు.ఇక గౌతమ్ తిన్ననూరి సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇంతగా రామ్ చరణ్  తన సినిమాలను చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం పెద్దగా సినిమాల హడావుడి లేదంటూ విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలో కొరటాల శివతో స్పీడ్ గా  సినిమాని చేయాలనుకున్న ఎన్టీఆర్ కు  కరోనా  మూడవ వేవ్ ఇబ్బంది కలిగిస్తుంది.

ఆర్ ఆర్ ఆర్  సినిమా విడుదల అయితే ఆ వెంటనే ఆచార్య సినిమా కూడా విడుదల అయ్యే అవకాశం ఉండేది.

కానీ ఇప్పుడు రెండు సినిమాలు కూడా వాయిదా పడ్డాయి.దాంతో ఎన్టీఆర్ మరియు కొరటాల శివ సినిమా ఆలస్యం  అయ్యింది.

రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ల సమయం అయినా ఇవ్వాలి.కానీ కరోనా  వల్ల ఎన్టీఆర్ ఏకంగా నాలుగేళ్ల సమయం ఇవ్వాల్సి వచ్చింది.

Telugu Corona Effect, Crorona Wave, Koratala Siva, Jr Ntr, Koratala Shiva, Ntr,

ఎన్టీఆర్ ముందస్తు వ్యూహం దెబ్బతిన్నట్లు గా కొందరు విమర్శిస్తున్నారు.ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అవ్వాల్సి ఉంది కానీ ప్రారంభం కాలేదు.అందుకు ఎన్టీఆర్ యొక్క ప్లానింగ్ లోపమే అంటూ కొందరు విమర్శిస్తున్నారు.ఏది ఏమైనా ఎన్టీఆర్ తో రెండు మూడు సినిమాలు స్పీడ్ గా చేస్తే కానీ అభిమానులు సంతృప్తి చెందేలా లేరు.

అందుకే కొరటాల శివ సినిమా సమ్మర్లో ప్రారంభించిన వెంటనే పూర్తి చేసి ఆ వెంటనే మరో దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తమవుతుంది.మరి ఎన్టీఆర్ నిర్ణయం ఏంటో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube